iDreamPost

ఇద్దరు పిల్లల తల్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం! చివరికి..

  • Author Soma Sekhar Published - 02:24 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 02:24 PM, Mon - 25 September 23
ఇద్దరు పిల్లల తల్లి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం! చివరికి..

తాటిచెర్ల లక్ష్మి-నారాయణ స్వామి ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నారాయణ స్వామి అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మి తన పిల్లలను పెంచి పెద్దచేసి ఇద్దరి కుమార్తెలకు వివాహం చేసింది. ఇక్కడి వరకు బాగానే సాగిన ఆమె జీవితం.. ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. కుమార్తెల పెళ్లి తర్వాత కడపలోని ఎన్జీవో కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటోంది లక్ష్మి. ఇక్కడే ఆమెకు ఆవుల రామాంజనేయులు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం ఆమె జీవితంలో వెలుగు నింపుతుందనుకుంది. కానీ చివరికి చీకటినే నింపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ స్వామి-లక్ష్మీ భార్యా భర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో నారాయణ స్వామి చనిపోయాడు. అనంతరం కుటుంబాన్ని కూలీ పనులు చేసుకుంటూ నెట్టుకొస్తోంది లక్ష్మి. ఈ క్రమంలోనే ఇద్దరి కూతుళ్ల వివాహలు చేసింది. అనంతరం కడపలోని ఎన్జీవో కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అక్కడ లక్ష్మికి బేల్దారి పని చేస్తున్న జమ్మలమడుగుకు చెందిన ఆవుల రామాంజనేయులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో పాటే కూలీ పనులకు కలిసి వెళ్లేది లక్ష్మి. వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో ఎలాగైనా ఆమె పీడ వదిలించుకోవాలని అనుకున్నాడు రామాంజనేయులు. శుక్రవారం రాత్రి లక్ష్మి ఇంటికి వెళ్లి.. ఆమె నిద్రపోతున్న సమయంలో రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పరారయ్యాడు. మరుసటి రోజు స్థానికులు లక్ష్మిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు కడప రిమ్స్ కు తరలించారు. లక్ష్మి కుమార్తె నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి