iDreamPost

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఖుషి’.. విజయ్-సమంతల ఆ సీన్స్ కూడా..!

  • By singhj Published - 11:30 AM, Sun - 24 September 23
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఖుషి’.. విజయ్-సమంతల ఆ సీన్స్ కూడా..!

టాలీవుడ్​లో చాలా తక్కువ టైమ్​లోనే స్టార్​డమ్​ను సంపాదించుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ లాంటి వరుస హిట్స్​తో బాక్సాఫీస్​ను షేక్ చేశారు విజయ్. ఆయన యాక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ అయితే అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఈ మూవీతో యూత్​లో తిరుగులేని ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు విజయ్. బోల్డ్​గా తనకు నచ్చింది మాట్లాడటం విజయ్ స్టైల్. అందుకే ఆయన్ను అభిమానులు ముద్దుగా రౌడీస్టార్ అని పిలుచుకుంటారు. అయితే వరుస హిట్లతో దూసుకెళ్లిన విజయ్​కు అనంతరం వరుసగా పరాజయాలు పలకరించాయి.

‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ చిత్రాల ఫలితాలతో రేసులో విజయ్ దేవరకొండ కాస్త వెనుకపడ్డారు. ఈ మూవీస్ అనుకున్నంతగా ఆడలేదు. ‘లైగర్’ అయితే అట్టర్ ఫ్లాప్​గా నిలిచింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్న విజయ్​.. అనుభవజ్ఞుడైన దర్శకుడు శివ నిర్వాణ మూవీకి ఓకే చెప్పారు. వీళ్ల కలయికలో వచ్చిన సినిమానే ‘ఖుషి’. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ ఫిల్మ్​లో రౌడీస్టార్ సరసన సమంత హీరోయిన్​గా యాక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్​ బాగుండటం, పాటలు సూపర్ హిట్టవ్వడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో విజయ్ ఖాతాలో మరో హిట్ ఖాయమని అనిపించింది.

‘ఖుషి’ సినిమాకు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్-సమంతల జోడీకి ఆడియెన్స్ ఫుల్ మార్క్స్ వేశారు. దీంతో మొదటి మూడ్రోజులు కలెక్షన్లలు అదిరిపోయాయి. కానీ సోమవారం నుంచి వసూళ్లు తగ్గాయి. ఓవర్సీస్​తో పాటు నైజాంలో లాభాలు తీసుకొచ్చింది. కేరళ, తమిళనాడులోనూ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే ‘ఖుషి’కి సీడెడ్, ఆంధ్రాలో నష్టాలు వచ్చాయని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. లాంగ్ రన్ బాగుంటే నష్టాల బారి నుంచి బయటపడేదని చెబుతున్నారు. మొత్తానికి థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీలోకి వచ్చేందుకు ‘ఖుషి’ రెడీ అవుతోంది.

‘ఖుషి’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. బిజినెస్ డీల్ జరుపుకున్న టైమ్​లోనే ‘ఖుషి’ని బిగ్​స్క్రీన్స్​లో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్​ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అక్టోబర్ 1వ తేదీన ‘ఖుషి’ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్​ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. సెన్సార్ కాని వెర్షన్​ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నారట. సమంత, విజయ్​ల మధ్య ఉండే మరిన్ని సీన్స్​ను ఇందులో చూపించబోతున్నారని సమాచారం. మరి.. ‘ఖుషి’ మూవీని చూసేందుకు మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 16 ఏళ్ల తర్వాత కలసి నటిస్తున్న ప్రభాస్-నయనతార!