iDreamPost

ఇకపై కోఠి ఉమెన్స్ కాలేజ్ కాదు.. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం..

ఇకపై కోఠి ఉమెన్స్ కాలేజ్ కాదు.. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం..

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మహిళా వర్సిటీని స్థాపించగా దాని కార్యకలాపాలన్నీ కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచే చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంగణాన్ని మహిళా వర్సిటీగా మార్చి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.విజ్జులత తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. 98 సంవత్సరాలుగా ఓయూకు అనుబంధంగా సాగిన, ఎంతో చరిత్ర కలిగిన కోఠి మహిళా కాలేజీ ఈ విద్యా సంవత్సరం (2022–23) నుండి తెలంగాణ మహిళా యూనివర్సిటీ(TMU)గా మారనుంది.

అలాగే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీసీని నియమించాల్సి ఉంది. ఇంకా వీసీని నియమించకపోవడంతో వర్సిటీలో చేపట్టాల్సిన అనేక పనుల్లో జాప్యం జరుగుతోంది. విద్యా సంవత్సరం మరో 10 రోజుల్లో మొదలు కావొస్తున్నా ఇంకా మహిళా వర్సిటీ పరిధిలోని కాలేజీల సంఖ్య, కోర్సుల వివరాలు ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. రాష్ట్రంలో జరిగే అన్ని ఎంట్రెన్స్ పరీక్షల జాబితాల్లో కూడా తెలంగాణ మహిళా వర్సిటీని చేర్చారు. దీనివల్ల మరిన్ని ఉమెన్స్ కాలేజీలు, మరింతమంది యువతులకు లాభం చేకూరనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి