iDreamPost
android-app
ios-app

TDP షాక్… వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత!

తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాచర్ల నియోజవర్గంలోని టీడీపీ కి చెందిన కీలక నేత వైఎస్సాఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సాఆర్ సీపీలో చేరారు.

తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాచర్ల నియోజవర్గంలోని టీడీపీ కి చెందిన కీలక నేత వైఎస్సాఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సాఆర్ సీపీలో చేరారు.

TDP షాక్… వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి..టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ఇటీవలే జనసేనకు చెందిన కీలక నేత సందీప్.. వైఎస్సాఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. అలానే గతంలో టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాచర్ల నియోజకవర్గంలోని టీడీపీ నేత వైసీపీలో జాయిన్ అయ్యారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభించిన రోజే.. ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన కొమ్మారెడ్డి చలమారెడ్డి వైఎస్సాఆర్ సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. చలమారెడ్డిని సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక కొమ్మారెడ్డి చలమారెడ్డి వెంట మరికొందరు టీడీపీ నేతలు కూడా వైఎస్సాఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కూడా అక్కడ హాజరయ్యారు. ఇక చలామారెడ్డి విషయానికి వస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

నిజానికి ఈ రెండు ఎన్నికల్లో చలమారెడ్డి ఓటమిపాలైనప్పటికి.. భారీ సంఖ్యలోనే ఓట్లను సంపాదించారు. 2014 ఎన్నికల విషయానికి వస్తే.. ఈయనకు 90వేల పై చిలుకు ఓట్లను సంపాదించారు.  అలాంటి బలమైన నేతను పక్కన పెట్టి.. జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని నియోజకవర్గ ఇన్ ఛార్జీగా నియమించారు. చలమారెడ్డి లాంటి బలమైన నేత వైసీపీలో చేరడం.. మాచర్లలో బలంగా ఉన్న వైసీపీ మరింత బలాన్ని ఇచ్చినట్లు అయ్యింది. అలానే ఇప్పటికే బలహీనంగా  ఉన్న టీడీపీ.. చలమారెడ్డి వీడటంతో మరింత బలహీనత పడింది.  చలమారెడ్డి వైసీపీలో చేరడం అనేది మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. టీడీపీ కీలక నేత వైసీపీ చేరడం టీడీపీ గట్టి షాకే  అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి