iDreamPost

టీచర్లకు షాక్.. 26 వేల మంది ఉద్యోగాలు రద్దు.. జీతాలు కూడా వెనక్కి ఇచ్చేయాల్సిందే!

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు బిగ్ షాక్. ఏకంగా 26 వేల మంది టీచర్ ఉద్యోగాలు రద్దయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు పొందిన జీతాలు కూడా తిరిగి ఇచ్చేయాల్సిందే.

ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు బిగ్ షాక్. ఏకంగా 26 వేల మంది టీచర్ ఉద్యోగాలు రద్దయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు పొందిన జీతాలు కూడా తిరిగి ఇచ్చేయాల్సిందే.

టీచర్లకు షాక్.. 26 వేల మంది ఉద్యోగాలు రద్దు.. జీతాలు కూడా వెనక్కి ఇచ్చేయాల్సిందే!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిచే పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగాలను బట్టి ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ని వడపోతల తర్వాత ఉద్యోగం వరిస్తుంది. ఇక ఉపాధ్యాయ ఉద్యోగాల విషయానికొస్తే మాత్రం.. డిగ్రీతో పాటు.. వృత్తి విద్యా కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీచర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే టీచర్ ఎలిజిబులిటీ టెస్టు కూడా పాసవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాతనే ఉపాధ్యాయ నియామక పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఇలా అన్ని పరీక్షలను ఎదుర్కొని టీచర్ ఉద్యోగాలను పొందిన వారికి బిగ్ షాక్ తగిలింది. పదులు, వందలు కాదు ఏకంగా 26 వేల మంది టీచర్ ఉద్యోగాలు రద్దయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌ లోని ప్రభుత్వ టీచర్లకు కోల్‌కతా హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. 2016 నిర్వహించిన స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని పలువురు కోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారు. సుధీర్ఘ విచారణల అనంతరం కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో 26 వేల మంది టీచర్ల భవిష్యత్తు అంధకారంలో పడినట్లైంది.

2016లో బెంగాల్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని 24,650 ఖాళీల భర్తీ కోసం స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం 25,753 మందిని ఎంపిక చేసి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. అయితే ఈ నియామక పరీక్షలో భారీగా అవకతవకలు జరిగాయని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. విచారణ అనంతరం 2016 నాటి ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినందున ఆ పరీక్ష చెల్లదని తీర్పు వెలువరించింది. అంతేకాదు 2016 ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు నాలుగు వారాల్లోగా తాము పొందిన వేతనాలను తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి