iDreamPost

దరిద్రం అంటే RCBదే.. IPL హిస్టరీలో ఇలాంటి టీమే లేదు!

  • Published Apr 22, 2024 | 8:04 AMUpdated Apr 22, 2024 | 8:04 AM

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్​లో డుప్లెసిస్ సేన పరాజయం పాలైంది.

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్​లో డుప్లెసిస్ సేన పరాజయం పాలైంది.

  • Published Apr 22, 2024 | 8:04 AMUpdated Apr 22, 2024 | 8:04 AM
దరిద్రం అంటే RCBదే.. IPL హిస్టరీలో ఇలాంటి టీమే లేదు!

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆర్సీబీకి మరో ఓటమి ఎదురైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో డుప్లెసిస్ సేన ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా నైట్ రైడర్స్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఆ టీమ్​లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48) విధ్వంసక ఇన్నింగ్స్​తో మెరిశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 50) యాంకర్ ఇన్నింగ్స్​తో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆఖర్లో ఆండ్రీ రస్సెల్ (20 బంతుల్లో 27 నాటౌట్) బిగ్ షాట్స్​తో అలరించాడు. అనంతరం ఛేజింగ్​కు దిగిన బెంగళూరు 20 ఓవర్లకు 221 పరుగులే చేయగలిగింది. విల్ జాక్స్ (32 బంతుల్లో 55), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 52) పోరాడినా టీమ్​ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. అయితే ఇంత తక్కువ మార్జిన్​తో ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు.

ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓడటాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయానికి అంత చేరువగా వచ్చి ఆగిపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్​లో గెలిచి గాడిన పడుతుందేమోనని భావిస్తే అది సాధ్యం కాకపోవడంతో బాధపడుతున్నారు. అదృష్టం వెక్కిరించడం వల్లే తమకు ఓటమి ఎదురైందని భావిస్తున్నారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీకి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో కూడా పలుమార్లు ఆ టీమ్ ఇలా స్మాల్ మార్జిన్స్​తో ఓడిపోయింది. 2008లో ఫస్ట్ సీజన్​లో ఇదే కేకేఆర్ మీద 5 పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్​లో పరాజయం పాలైంది. ఆ తర్వాత 2014లో మళ్లీ కోల్​కతా చేతుల్లోనే 2 పరుగుల తేడాతో విజయానికి చేరువగా వచ్చి ఆగిపోయింది.

No team like this in IPL history!

2021లో సన్​రైజర్స్ హైదరాబాద్ మీద 4 పరుగుల తేడాతో ఓడింది ఆర్సీబీ. ఇప్పుడు కేకేఆర్ చేతుల్లో 1 పరుగు తేడాతో ఓడి ప్లేఆఫ్స్​ ఆశలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. దరిద్రానికి కేరాఫ్ అడ్రస్​గా బెంగళూరును చెబుతున్నారు. ఇంత స్మాల్ మార్జిన్స్​తో ఓడటం ఏంటని.. మ్యాచ్​ను ఫినిష్ చేయకపోవడం ఆ టీమ్​ను దెబ్బతీస్తోందని అంటున్నారు. ఎంత బాగా ఆడినా ఒక్క పరుగు తేడాతోనే ఓడిపోయారంటే దరిద్రం ఆర్సీబీని ఎంతగా వెంటాడుతోందో అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరు రాతను ఇంకా ఎవరూ మార్చలేరని అంటున్నారు. మరి.. ఆర్సీబీ ఓటమిపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి