iDreamPost

వీడియో: విరాట్‌ కోహ్లీ అవుట్‌పై తీవ్ర వివాదం! అసలు రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

  • Published Apr 22, 2024 | 7:41 AMUpdated Apr 22, 2024 | 7:41 AM

Virat Kohli, RCB vs KKR: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక్క రన్‌ తేడాతో ఓడిపోయింది. కానీ, దాన్ని మించిన బాధ కోహ్లీ అవుట్‌. విచిత్రమైన రీతిలో కోహ్లీ అవుట్‌ అయ్యాడు. అసలు కోహ్లీ అవుట్‌పై రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, RCB vs KKR: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక్క రన్‌ తేడాతో ఓడిపోయింది. కానీ, దాన్ని మించిన బాధ కోహ్లీ అవుట్‌. విచిత్రమైన రీతిలో కోహ్లీ అవుట్‌ అయ్యాడు. అసలు కోహ్లీ అవుట్‌పై రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Apr 22, 2024 | 7:41 AMUpdated Apr 22, 2024 | 7:41 AM
వీడియో: విరాట్‌ కోహ్లీ అవుట్‌పై తీవ్ర వివాదం! అసలు రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఒక పరుగుతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. హైస్కోరింగ్‌ గేమ్‌ సాగిన ఈ మ్యాచ్‌లో.. ఇరు జట్లు బ్యాటింగ్‌లో అదరగొట్టాయి. చివరి బాల్‌కు మూడ పరుగులు అవసరమైన సమయంలో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగి.. ఒక్క రన్‌ తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ అధికారికంగా ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయినట్లే. అయితే.. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పా.. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అవుట్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎంత కసితో బరిలోకి దిగి అద్భుతమైన టచ్‌లో కనిపించిన కోహ్లీ.. విచిత్రమైన రీతిలో అవుట్‌ అయ్యాడు.

అంతా దాన్ని నో బాల్‌ అనుకున్నారు. కానీ, థర్డ్‌ అది నో బాల్‌ కాదు.. కోహ్లీ అవుట్‌ అని నిర్ధారించడంతో అంతా షాక్‌ అయ్యారు. కోహ్లీ అయితే గ్రౌండ్‌లోనే ఆవేశంతో ఊగిపోయాడు. అంపైర్లపై తన ఆగ్రహం చూపించాడు. చాలా మంది క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ నాటౌట్‌ అని, టెక్నాలజీ తప్పు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఓ నో బాల్‌ను ప్రస్తావిస్తూ.. దాని కంటే హర్షిత్‌ రాణా వేసిన బాల్‌ ఎక్కువ ఎత్తులో ఉన్నా కూడా ఇది ఎందుకు నో బాల్ కాదంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ రెండింటిలో తేడా ఏంటి? రూల్స్‌ ఏం చెబుతున్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐసీసీ రూల్స్‌ ప్రకారం.. బాల్‌, బ్యాట్‌ను ఎక్కడైతే కనెక్ట్‌ అవుతుందో.. ఆ టైమ్‌లో బాల్‌ బ్యాటర్‌ నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే అది నో బాల్‌ అవుతుంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌లో కోహ్లీ ఎదుర్కొన్న బాల్‌ నో బాల్‌ అయింది. కానీ, ఈ ఏడాది ఐపీఎల్‌లో బీసీసీఐ ఒక కొత్త రూల్‌ తీసుకొని వచ్చింది. అదేంటంటే.. ఐపీఎల్‌లో ఆడే ప్రతి ఆటగాడి నడుము ఎంత ఎత్తు ఉందో కొలతలు తీసుకున్న బీసీసీఐ.. సరిగ్గా క్రీజ్‌లో ఉన్నప్పుడు ఆ కొలత కంటే ఎక్కువ ఎత్తులో వస్తే అది నో బాల్‌, తక్కువ ఎత్తలో వస్తే లీగల్‌ డెలవరీ, ఆదివారం కేకేఆర్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లీ బాల్‌ను కనెక్ట్‌ చేసిన టైమ్‌లో బాల్‌ నడము కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ.. బీసీసీఐ రూల్స్‌ ప్రకారం క్రీజ్‌లోకి వచ్చే సరికి బాల్‌ డిప్‌ అయి.. కోహ్లీ నడుము ఎత్తు కంటే తక్కువ ఎత్తులో వెళ్తోంది.

అందుకే దాన్ని లీగల్‌ డెలవరీగా పరిగణించి.. కోహ్లీని అవుట్‌గా ప్రకటించారు. గ్రౌండ్‌ నుంచి కోహ్లీ నడుము 1.04 మీటర్లు కాగా, బాల్‌ 0.92 మీటర్ల ఎత్తులో వెళ్తుంది. మరో 0.13 మీటర్ల ఎత్తులో వెళ్లి ఉంటే అది నో బాల్‌ అయ్యేది కోహ్లీ అవుట్‌ నుంచి బతికిపోయేవాడు. ఈ రూల్‌పై మ్యాచ్‌ తర్వాత అంపైర్లు కోహ్లీకి వివరించారు. దాంతో కోహ్లీ శాంతించాడు. ఏది ఏమైనా.. ఈ రూల్‌పై మాత్రం క్రికెట్‌ అభిమానులు సంతృప్తిగా లేరు. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ అలా అవుట్‌ కాకపోయి ఉంటే.. కచ్చితంగా మ్యాచ్‌ ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు. మరి కోహ్లీ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి