iDreamPost
android-app
ios-app

IPL 2024: ఫ్లైట్‌లో హైడ్రామా! KKR ఆటగాళ్లంతా అదే ఫ్లైట్‌లో! అసలు ఏమైందంటే?

  • Published May 07, 2024 | 12:43 PM Updated Updated May 07, 2024 | 12:43 PM

లక్నోతో మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ ప్లేయర్లకు తిప్పలు తప్పలేదు. దాంతో వారు అనుకోకుండా వేరే హోటల్ లో బస చేయాల్సి వచ్చింది. మరి ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

లక్నోతో మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ ప్లేయర్లకు తిప్పలు తప్పలేదు. దాంతో వారు అనుకోకుండా వేరే హోటల్ లో బస చేయాల్సి వచ్చింది. మరి ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: ఫ్లైట్‌లో హైడ్రామా! KKR ఆటగాళ్లంతా అదే ఫ్లైట్‌లో! అసలు ఏమైందంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపే ప్రదర్శనతో దూసుకెళ్తోంది కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్. టోర్నీ ఆరంభం నుంచి సమష్టితత్వంతో విజయభావుట ఎగురవేస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ ల్లో 8 విజయాలతో దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇటీవలే లక్నోను 98 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కేకేఆర్ ప్లేయర్లకు ఓ సమస్య ఎదురైంది. నెక్ట్స్ మ్యాచ్ కోసం వారు ప్రయాణిస్తున్న విమానం ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కేకేఆర్ ప్లేయర్లు ప్రయణిస్తున్న విమానం ప్రతికూల వాతవరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే? లక్నో ఆదివారం మ్యాచ్ ముగించుకున్న కేకేఆర్ టీమ్.. తన నెక్ట్స్ మ్యాచ్ ను మే 11న ముంబైతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ప్లేయర్లు చార్టర్డ్ విమానంలో సోమవారం సాయంత్రం 5. 45 గంటలకు లక్నో నుంచి కోల్ కత్తాకు బయలుదేరారు. రాత్రి. 7.25 గంటలకు విమానం కోల్ కత్తా చేరుకోవాల్సింది. కానీ అక్కడ కుండపోత వర్షం కురుస్తుండటంతో.. ల్యాండింగ్ కు క్లియరెన్స్ ఇవ్వలేదు అధికారులు. దాంతో విమానాన్ని గుహవాటికి మళ్లించారు. గుహవాటికి చేరుకున్న తర్వాత కోల్ కత్తా నుంచి క్లియరెన్స్ రావడంతో ఫ్లైట్ కోల్ కత్తాకు బయలుదేరింది.

అయితే మళ్లీ మధ్యలో వాతావరణం అనుకూలించట్లేదని సిగ్నల్స్ రావడంతో.. విమానాన్ని వారణాసికి మళ్లించారు. సోమవారం రాత్రి అక్కడే ఓ హోటల్ లో బసచేశారు కేకేఆర్ ప్లేయర్లు. మంగళవారం మధ్యాహ్నం అదే ఫ్లైట్ లో వారణాసి నుంచి కోల్ కత్తాకు బయలుదేరనున్నారు ప్లేయర్లు. కాగా.. గత కొన్ని రోజులుగా కోల్ కత్తాలో విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. కానీ ఒక్కసారిగా సోమవారం కుండపోత వర్షం కురిసి.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది.