iDreamPost

ఖాకీ ది బీహార్ ఛాప్టర్ రిపోర్ట్

ఖాకీ ది బీహార్ ఛాప్టర్ రిపోర్ట్

పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు చూశాం. అయినా కాస్త వెతికి తరచి చూడాలే కానీ ఇంకా చెప్పాల్సిన బోలెడు నేరమయ గాథలు స్టేషన్ రికార్డుల్లో భద్రంగా ఉంటాయి. అందులో ఒకదాన్ని తీసుకుని నీరజ్ పాండే రచనలో భవ్ ధులియా దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ఖాకీ ది బీహార్ చాఫ్టర్. నెట్ ఫ్లిక్స్ లో ఏడు భాగాలతో ఇటీవలే స్ట్రీమింగ్ మొదలైంది. ఒకేసారి మొత్తం చూడాలంటే ఆరు గంటల సమయం వెచ్చించాల్సిందే. అంత సుదీర్ఘంగా సాగే కాప్ డ్రామా ఇది. ట్రైలర్ వచ్చాక దీని మీద ఆసక్తి పెరిగింది. అరాచకాలకు అడ్డాగా చెప్పుకునే బీహార్ లో 2005లో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది

ఏ ఆధారం లేని వెనుకబడిన కులానికి చెందిన చందన్ మాతో(అవినాష్ తివారి)చిన్న చిన్న నేరాలు చేస్తూ గ్యాంగ్ స్టర్ గా ఎదిగే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. కిరాతకంగా ఎవరినైనా హత్యలు చేయడానికి వెనుకాడని మనస్తత్వం ఇతనిది. ఓసారి జైలునే బాంబులతో దాడి చేయించి పారిపోతాడు. ఇన్ఫార్మర్లనే నెపంతో ఓ గ్రామంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి పాతిక ప్రాణాలు బలి తీసుకుంటాడు. వీడిని పట్టుకోవడానికి డిపార్ట్ మెంట్ ఎస్పి అమిత్ లోధా(కరణ్ థాకర్)ని పంపిస్తుంది. స్థానిక ఇన్స్ పెక్టర్(అభిమన్యు సింగ్)సహాయంతో చందన్ వేట మొదలుపెడతాడు. ఎవరికీ దొరక్క అజ్ఞాతంలో ఉన్న చందన్ అమిత్ ల మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమే అసలు స్టోరీ

ఇది నిజంగా జరిగిన కథే. అమిత్ లోధా అనే పోలీస్ ఆఫీసర్ రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు బీహార్ నేపధ్యాన్ని అక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో ధులియా సక్సెస్ అయ్యారు. పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ కు కొంత సమయం తీసుకున్నప్పటికీ మూడో ఎపిసోడ్ నుంచి వేగం పెరుగుతుంది. మంచి ట్విస్టులు పడ్డాయి. ఇంత డెడ్లీ క్రిమినల్ బయోపిక్ ని ఎలాంటి అశ్లీలత, మితిమీరిన హింస లేకుండా తెరకెక్కించిన విధానం బాగుంది. కరణ్ ధాకర్ బాగా నటించాడు కానీ చందన్ మాతోగా బెటర్ ఆర్టిస్టు పడి ఉండే క్యారెక్టర్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. ఈ జానర్ ని ఇష్టపడేవాళ్ళను నిరాశపరచని విధంగా ఈ ఫస్ట్ సీజన్ సాగిందని చెప్పొచ్చు. తెలుగుతో పాటు ప్రధాన భాషలు అన్నింటికి డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి