iDreamPost
android-app
ios-app

NTR, ప్రశాంత్ నీల్ మూవీపై కీలక అప్డేట్! ఫ్యాన్స్‌కు పండగే..!

  • Published May 20, 2024 | 11:38 AM Updated Updated May 20, 2024 | 11:38 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న చిత్రాలకు సంబంధించిన అప్డేట్ వస్తున్నాయి. దేవర నుండి ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే మరో మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న చిత్రాలకు సంబంధించిన అప్డేట్ వస్తున్నాయి. దేవర నుండి ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే మరో మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

  • Published May 20, 2024 | 11:38 AMUpdated May 20, 2024 | 11:38 AM
NTR, ప్రశాంత్ నీల్ మూవీపై కీలక అప్డేట్! ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగిన తారక్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న చిత్రాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ వస్తున్నాయి.  యంగ్ టైగర్ తెరపై కనిపించి రెండేళ్లు దాటిపోవడంతో అన్న ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. దీంతో  వారిని ఆనందంలో మునిగితేల్చేందుకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు దేవర దర్శకుడు కొరటాల  శివ.  తారక్ బర్త్ డే ముందు రోజు  దేవర సినిమా నుండి సాంగ్ రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఫియర్ పాటకు ఫిదా అయిపోయారు.

అనిరుధ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. దేవర రెండు పార్టులుగా తె రకెక్కుతోన్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాను దసరా కానుకగా.. అక్టోబర్ 10న విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు . ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కినేని నిర్మిస్తున్నారు. అలాగే ఈ ఏడాది బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో వార్ చేయబోతున్నాడు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్. ఇప్పుడు అభిమానులకు పండుగ లాంటి వార్తను మోసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ.

కేజీఎఫ్-సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడని తెలిసిందే. తారక్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఎన్టీర్-నీల్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభం కాబుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలోగా దేవర కంప్లీట్ అయిపోతుంది. పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అంతలో ప్రశాంత్ నీల్- ప్రభాస్‌తో సలార్-2 శౌర్యాంగ పర్వం ముగించేయనున్నాడు. ఎన్టీఆర్‌తో షూటింగ్ స్టార్ చేసే సమయానికి ఈ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాట నీల్.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetist