iDreamPost

Muhammad Riswan: సరదాగా చేసిన రీల్‌.. ప్రపంచ రికార్డు తెచ్చిపెట్టింది!

  • Published Jan 09, 2024 | 7:20 PMUpdated Jan 09, 2024 | 7:20 PM

ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ చేసేవారు వ్యూస్ కోసం తపనపడుతుంటారు. పదుల కొద్దీ రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. కానీ ఒక యువకుడు మాత్రం సరదాగా చేసిన ఓ రీల్​తోనే వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

ఇన్​స్టాగ్రామ్​ రీల్స్ చేసేవారు వ్యూస్ కోసం తపనపడుతుంటారు. పదుల కొద్దీ రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. కానీ ఒక యువకుడు మాత్రం సరదాగా చేసిన ఓ రీల్​తోనే వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

  • Published Jan 09, 2024 | 7:20 PMUpdated Jan 09, 2024 | 7:20 PM
Muhammad Riswan: సరదాగా చేసిన రీల్‌.. ప్రపంచ రికార్డు తెచ్చిపెట్టింది!

రీల్స్.. ఈ పదం తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నేటి టెక్నాలజీ యుగంలో మొబైల్ అందరి చేతుల్లోకి వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్లు రీల్స్ చూడకుండా ఉండలేని పరిస్థితి. ఏ కొందరో తప్పితే ప్రతి ఒక్కరికీ వీటితో పరిచయమే. ఈ రీల్స్ ద్వారానే ఇన్​స్ట్రాగ్రామ్ యాప్​కు ఇంత పాపులారిటీ వచ్చింది. రీల్స్ ద్వారా ఎంతో మంది అనామకులు పాపులర్ అయ్యారు. సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లతో పాటు సామాన్యుల్లోనూ చాలా మంది సరదాగా రీల్స్ చేస్తూ ఇన్​స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ఒకవేళ రీల్స్ పాపులర్ అయితే దాని ద్వారా ఫాలోవర్లు పెరుగుతారు. రెగ్యులర్​గా వీడియోలు పోస్ట్ చేస్తూ పోతే బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఉండటంతో రీల్స్​పై చాలా మందిలో ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఓ కుర్రాడు మాత్రం సరదాగా చేసిన రీల్ కాస్తా వైరల్ అయిపోయింది. అది ఏకంగా వరల్డ్ రికార్డు తెచ్చిపెట్టింది. దీంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

కేరళలోని మలప్పురానికి చెందిన మహ్మద్ రిస్వాన్​ అనే కుర్రాడు చేసిన ఓ వీడియో ప్రపంచ రికార్డు సృష్టించింది. సరదాగా ఫుట్​బాల్ ఆడుతూ అతడు చేసిన రీల్​కు ఏకంగా 350 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక వ్యూస్​ తెచ్చుకున్న రీల్​గా ఇది నిలిచింది. 20 రోజుల కింద ఓ జలపాతం చూసేందుకు వెళ్లాడు రిస్వాన్. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఒక ఫుట్​బాల్​ను తీసుకొని రెండు బండరాళ్ల మధ్య గట్టిగా కొట్టాడు. అది కాస్తా ఒక రాయికి తగిలి ఆ తర్వాత ఇంకో రాయిని టచ్ చేసి మధ్యలో వస్తున్న నీటి ప్రవాహంపై పడింది. తాను కొట్టిన బంతి తిరిగి అతడి దగ్గరకే వచ్చింది. దీంతో వాటర్​ఫాల్​లో ఎంజాయ్ చేస్తున్న మరో యువకుడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ రీల్​ను రిస్వాన్ ఇన్​స్టాలో పెట్టగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

రిస్వాన్ రీల్​కు రోజురోజుకూ వ్యూస్ పెరుగుతూ పోతున్నాయి. అనూహ్యంగా 360 మిలియన్ల మార్క్​ను టచ్ చేసిందా రీల్. ప్రస్తుతం అది ట్రెండ్ అవుతున్న తీరును బట్టి ఈజీగా 400 మిలియన్ల మార్క్​ను దాటుతుందని అనిపిస్తోంది. ఇన్​స్టాలో అత్యధిక వ్యూస్​ దక్కించుకున్న రీల్​గా ‘లర్న్ ఫ్రమ్ ఖబీ’ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన రీల్ ఉండేది. కానీ రిస్వాన్ రీల్ దాన్ని క్రాస్ చేసి కొత్త టార్గెట్​ను సెట్ చేసింది. ఈ రీల్ చూసిన నెటిజన్స్ రిస్వాన్ సరదాగా కొట్టినా అతడి ఫుట్​బాల్ స్కిల్స్ అద్భుతమని కొనియాడుతున్నారు. అతడి టాలెంట్​కు దక్కిన గౌరవం ఇదని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రిస్వాన్ రియాక్ట్ అయ్యాడు. ఫ్రెండ్స్​తో కలసి ట్రిప్​కు వెళ్లిన టైమ్​లో తీసిన రీల్ ఇదన్నాడు. ఎక్కడికి వెళ్లినా ఫుట్​బాల్​ను వెంట తీసుకెళ్లడం తనకు అలవాటు అని.. అలా దాన్ని బండరాళ్ల మధ్య కొట్టినప్పుడు తీసిన రీల్ అదన్నాడు. ఇక, ఇన్​స్టాలో రిస్వాన్​ అకౌంట్​ పేరు ఫుట్​బాల్ ఫ్రీస్టైలర్​. దీనికి ఒకప్పుడు తక్కువ ఫాలోవర్స్ ఉండేవారు. కానీ ఒక్క రీల్ దెబ్బకు ఏకంగా 5 లక్షల ఫాలోవర్లు పెరిగారు. దీంతో అతడు సంతోషంలో మునిగిపోయాడు. మరి.. సరదాగా చేసిన రీల్ కాస్తా వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: రెండేళ్ల నుంచి జైల్లో ఉన్న మహిళ.. ప్రస్తుతం 4 నెలల గర్భవతి!

 

View this post on Instagram

 

A post shared by muhammed riswan (@riswan_freestyle)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి