iDreamPost

రెండేళ్ల నుంచి జైల్లో ఉన్న మహిళ.. ప్రస్తుతం 4 నెలల గర్భవతి!

ఓ మహిళ.. భర్తను చంపిన కేసులో రెండేళ్ల నుంచి జైల్లో గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే తన కుటుంబ సభ్యులకు సదరు మహిళ ఫోన్ చేసి.. షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అంటూ షాక్ ఇచ్చింది.

ఓ మహిళ.. భర్తను చంపిన కేసులో రెండేళ్ల నుంచి జైల్లో గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే తన కుటుంబ సభ్యులకు సదరు మహిళ ఫోన్ చేసి.. షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అంటూ షాక్ ఇచ్చింది.

రెండేళ్ల నుంచి జైల్లో ఉన్న మహిళ.. ప్రస్తుతం 4 నెలల గర్భవతి!

నిత్యం మనం అనేక రకాల వార్తలు వింటుంటాము. అందులో కొన్ని న్యూస్ లు అయితే చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని నమ్మడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి వార్తలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంటాయి. తాజాగా ఓ మహిళ విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ న్యూస్ విని.. సదరు మహిళ కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఎలా జరిగిందంటూ.. ఆందోళన వ్యక్తం చేశారు. తమ బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటనే కదా మీ సందేహం. ఆ విచిత్ర కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాకు చెందిన డేసీ లింక్  అనే 28 ఏళ్ల యువతి 2022 నుంచి గులీ ఫోర్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్  జైలులో  ఉంటుంది. ఇక ఆమె సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. డేసీ భర్త మితిమీరి ప్రవర్తించడంతో.. ప్రాణ రక్షణ కోసం అతడిని తుపాకీతో కాల్చేసింది. ఇదే విషయాన్ని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తుపాకీతో సింగిల్ షాట్ బుల్లెట్ తో డేసీ.. తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు రికార్డులు పేర్కొన్నాయి. ఆ సమయంలో డేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైల్లో ఉంచారు. డెసీ దాదాపుగా 2  ఏళ్ల నుంచి జైల్లోనే కస్టడీలో ఉంటుంది. తన భర్త హింసలు భరించలేక.. డేసీ అలాంటి దారుణ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇలా జైల్లో ఉన్న డేసీ..ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా ఇంటికి ఫోన్ చేసింది. ఆ సమయంలో వారికి షాకింగ్ వార్తను డెసీ తెలిపింది. తన ఫ్యామిలీతో జైలు నుంచి ఫోన్ మాట్లాడిన డెసీ.. ప్రస్తుతం తాను 4 నెలల ప్రెగ్నెన్సీ చెప్పింది. దీంతో డేసీ కుటుంబ సభ్యులకు మాటలు రాలేదు.  డేసీ మాటలను వారు నమ్మలేదు. చివరకూ ఆమె చెప్పిన మాటలు నిజమని నమ్మడంతో జైలు భద్రతపై  భయం వేస్తుందంటూ డేసీ ప్యామిలీ మీడియాకు తెలిపింది. ఇదే సమయంలో ఆమె తరపున న్యాయవాది కూడా పలు అనుమానాలను వ్యక్తం చేశారు. తన క్లయింట్ గర్భవతి కావడంతో ఆమె భద్రతపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఆమెను హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు.

అయితే డేసీకి ఆ గర్భం ఎవరి వల్ల వచ్చింది? అత్యాచారం ఏమైనా జరిగిందా? అనే విషయాలను వెల్లడించేందుకు డేసీ ఇష్టపడలేదని ఆమె సోదరి చెప్పుకొచ్చింది. డేసీ జైల్లో ఉన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తమకు ఫోన్ చేస్తూ ఉండేదని డేసీ సోదరి తెలిపింది. ఇప్పుడు కాల్ చేసినప్పుడు పూర్తి  విషయాలు చెప్పలేదు. ఎందుకంటే జైలులో ఫోన్లు అన్ని రికార్డవుతాయి. జైల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరు బ్లాక్స్ లో ఉన్నప్పటికీ ఇలా ఎలా, ఎందుకు జరిగిందని డేసీ సోదరి క్రిస్టల్ ఆరోపించింది. ఇదే సమయంలో జైలు అధికారులు కూడా డేసీకి వైద్య పరీక్షలు నిర్వహించగా… అందులో ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. కానీ  జైల్లో ఎటువంటి అత్యాచారం జరగలేదని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జైలు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి