సాధారణంగా రైతులు తాము పండించిన పంటను మార్కెట్ కి తీసుకెళ్లి.. ఆమ్మే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతు కష్టాలు స్వయంగా చూసిన వారికే అర్థం అవుతాయి. ఎండొచ్చిన, వరదలొచ్చిన రైతు పడే ఆవేదన వర్ణాతీతం. పంటను కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పరుగులు పెడుతుంటాడు. ఇన్ని కష్టాలు పడి.. పంటను విక్రయాన్నికి సిద్ధంగా ఉంచితే డలారీ వ్యవస్థ వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నారు.పెట్టిన పెట్టుబడి రాక.. అప్పు ఊబిలో చిక్కుకుని ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. ఇలా రైతుల కష్టాల మధ్య కొన్ని సంతోషంకరమైన ఘటనలు కనిపిస్తుంటాయి. అలాంటి ఘటన ఒకటే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ రైతు తన ఆకుకూరలను ఆడీ కారులో వచ్చి మరీ విక్రయించాడు. మరి.. ఆ రైతు వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళకు చెందిన సుజిత్ అనే 36 ఏళ్ల వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. అది ఏమిటంటే.. రోడ్డు పక్కన ఏర్పాటు చేసే మార్కెట్‌లో ఆకుకూరలు విక్రయించేందుకు సుజిత్ ఖరీదైన ఆడీ కారులో దిగాడు. ఆ కారులో నుంచి ఒక చాపను తీసి నేలపై పరిచాడు. అనంతరం కారులోని ఆకు కూరలను తీసి ఆ చాపలో పెట్టి విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది చూడగా.. కామెంట్లు కూడా పెడుతున్నారు. అతని వచ్చిన ఆడీ కారు ఏ4 మోడల్ కి చెందినది. అంత ఖరీదైన కారులో వచ్చి ఆకుకూరలను విక్రయిండం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ రూ.44 లక్షల విలువైన ఆడీ ఏ4 కారును సుజిత్ సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలానే సుజిత్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరు కూడా వెరైటీ ఫార్మర్ అని ఉండటం గమనార్హం.
సాధారణంగా రైతులు తాము పండించిన కూరగాయలను ఆటోలు, బైక్‌లు ఇంకా ఎక్కువగా ఉంటే ఓ ట్రక్కులో వేసుకుని వెళ్లి మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు. కానీ సుజిత్ మాత్రం అందరికన్నా వెరైటీ. ఎందుకంటే ఆకు కూరలు విక్రయించేందుకు ఏకంగా ఆడీ కారులో వచ్చాడు. సుజిత్ అందరిలా కాకుండా విభిన్న పద్దతుల్లో పంటలను సాగు చేస్తుంటాడు. దీంతోపాటు ఒకే సమయంలో ఒకే పంట కాకుండా రకరకాల పంటలు పండిస్తున్నాడు. సుజిత్ తన వ్యవసాయానికి సాంకేతికతను, అత్యాధునిక పద్ధతులు జోడించి లాభసాటిగా వ్యవసాయాన్ని చేశాడు. ఇక తన వ్యవసాయ పద్ధతుల గురించి మిగితా రైతులకు కూడా సుజిత్ అవగాహన కల్పిస్తూ ఉంటాడు. ఆధునిక పద్ధతులు ద్వారా వ్యవసాయం చేసిన సుజిత్ ఎస్పీకి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. మరి.. ఈ వెరైటీ రైతుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.