iDreamPost

ఇండియాకు రెండు మెడల్స్‌ అందించిన తెలంగాణ బిడ్డ ఇషా

  • Published Sep 30, 2023 | 10:39 AMUpdated Sep 30, 2023 | 10:39 AM
  • Published Sep 30, 2023 | 10:39 AMUpdated Sep 30, 2023 | 10:39 AM
ఇండియాకు రెండు మెడల్స్‌ అందించిన తెలంగాణ బిడ్డ ఇషా

చైనా వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే పలు పతకాలు సాధించి.. ఆసియా వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. తాజాగా షూటింగ్‌ విభాగంలో తెలంగాణ బిడ్డ ఇషా సింగ్‌ సైతం అదరగొట్టింది. దేశానికి రెండు పతాకాలు అందించింది. శుక్రవారం ఒక్క రోజే భారత అథ్లెట్లు రెండు బంగారు పతకాలతో సహా మొత్తం 8 పతకాలు గెలుచుకున్నారు.

అత్యధికంగా షూటింగ్‌ విభాగంలోనే ఐదు మెడల్స్ దక్కాయి. యువ షూటర్‌ పాలక్‌ గులియా ఒక గోల్డ్, సిల్వర్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన పాలక్.. టీమ్ పోటీలో సిల్వర్ సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో పాలక్‌ (242.1 పాయింట్లు) అగ్రస్థానం సాధించగా.. హైదరాబాదీ యువ షూటర్‌ ఇషా సింగ్‌ (239.7) రెండో స్థానంతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. పాలక్‌, ఇషా వీరిద్దరి వయసు 17 ఏళ్లే కావడం విశేషం.

ఇక పాలక్‌, ఇషాతో పాటు మరో యువ షూటర్‌ దివ్య కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ ముగ్గురిలో అత్యధికంగా మన తెలంగాణకి షాన్‌.. ఇషా 579 పాయింట్లు సాధించగా.. పాలక్‌ 577, దివ్య 575 పాయింట్లు నమోదు చేశారు. ముగ్గురు కలిసి మొత్తంగా 1731 పాయింట్లు సాధించారు. అయితే భారత్‌ జట్టు కంటే.. చైనా టీమ్‌ 1736 పాయింట్లు సాధించి గోల్డ్‌ మెడల్‌ గెలిచింది. భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ దక్కింది. కాగా, ఇషా ఇప్పటికే 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇషా.. దేశానికి నాలుగు పతాకలు అందించింది. మరి ఈ తెలంగాణ యువ షూటర్‌ సాధించిన విజయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ICC World Cup: వరల్డ్ కప్ కి ఆతిథ్యం.. BCCIకి రూ.955 కోట్ల నష్టం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి