iDreamPost

ముద్దు సీన్లలో అందుకే నటించాను – క్లారిటీ ఇచ్చిన అనుపమ

ముద్దు సీన్లలో అందుకే నటించాను – క్లారిటీ ఇచ్చిన అనుపమ

కార్తికేయ 2 సినిమా చూసిన వాళ్ళకు నిఖిల్ తో పాటు సమానంగా ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించిన అనుపమ కూడా కచ్చితంగా గుర్తుండిపోతుంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటవ్ టాక్ ను సొంతం చేసుకొని నార్త్ లోనూ స్క్రీన్స్ పెంచుకోవడం నిజంగా శుభపరిణామం. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

కార్తికేయ 2 సినిమాలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై చాలా సంతోషంగా ఉంది అనుపమ. ఈ స్పందన తనకు ఎంతో శక్తినిచ్చిందని చెప్పింది. ఈ చిత్రం కోసమే తాను కొన్ని ఆఫర్లను వదులుకున్నట్లుగా పేర్కొంది అనుపమ. దర్శకుడు చందు మొండేటి ఈ కథను చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనైయ్యానని, సినిమాలోని కృష్ణతత్వం అనే అంశం తనకు బాగా నచ్చిందని తెలిపింది. కేవలం కథకు తగినట్లుగా చందు తన పాత్రను తీర్చిదిద్దారని చెప్పుకొచ్చింది అనుపమ. అయితే “రౌడీ బాయ్స్” సినిమా కోసం ఆ కథలో పాత్ర డిమాండ్ చేయడం వల్లనే ముద్దు సీన్లో నటించినట్లు స్పషం చేసింది. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పింది అనుపమ.

కార్తికేయ దర్శకుడు చందు మొండేటి ఆ భాగానికి సీక్వెల్ గా తీసిన కార్తికేయ 2 చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. దాదాపు పూర్తి పాజిటివ్ టాక్ తో విడుదల రోజునే సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు కలిసి నిర్మించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి