iDreamPost

తనను బాగా చూసుకోవడం లేదని భార్యను చంపిన భర్త!

ఓ దుర్మార్గుపు భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య తనను బాగా చూసుకోవడం లేదని ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.

ఓ దుర్మార్గుపు భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య తనను బాగా చూసుకోవడం లేదని ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.

తనను బాగా చూసుకోవడం లేదని భార్యను చంపిన భర్త!

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం. అసలు సమస్య ఏంటి? దానికి పరిష్కారం మార్గం ఏంటి అనే దిశగా ఆలోచించకుండా హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలను చూసి స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి నేరాలు, ఘెరాలను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు చేపట్టినా.. దుర్మార్గుల ఆలోచన శైలీలో మాత్రం మార్పు రావడం లేదు. ఇదిలా ఉంటే.. ఓ దుర్మార్గపు భర్త కట్టుకున్న భార్య తనను బాగా చూసుకోవడం లేదని ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక బళ్లారి జిల్లా సిరుగుప్ప పరిధిలోని బాలకుండి గ్రామం. ఇక్కడే మైబునాబి (35)-రసూల్ సాబ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే మెలిగారు. అయితే, భర్త రసూల్ సాబ్ డయాలసిస్ పేషెంట్ కావడంతో ఎలాంటి పనులు చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో భార్య మోబునాబి కూలీనాలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇకపోతే, భార్య తనను పట్టించుకోవడం లేదని భర్త ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవ పడుతూ ఉండేవారు. ఇటీవల కూడా భర్త రసూల్ సాబ్ భార్య మైబునాబితో వాగ్వాదానికి దిగాడు. ఇదే కోపంతో ఊగిపోయిన భర్త.. ఎలాగైన భార్యను చంపాలని అనుకున్నాడు.

ఇందులో భాగంగానే ఇటీవల రసూల్ సాబ్ భార్య నిద్రపోతుండగా మైబునాబిపై గొడ్డలితో కర్కశంగా నరికాడు. భర్త దాడిలో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. తనను బాగా చూసుకోవడం లేదని భార్యను చంపిన పాపిష్టి భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి