iDreamPost

మిస్టరీగా టెక్కీ మరణం.. ఆత్మహత్య అంటోన్న భర్త.. అసలేం జరిగిందంటే!

  • Published Jul 18, 2023 | 8:44 AMUpdated Jul 18, 2023 | 8:44 AM
  • Published Jul 18, 2023 | 8:44 AMUpdated Jul 18, 2023 | 8:44 AM
మిస్టరీగా టెక్కీ మరణం.. ఆత్మహత్య అంటోన్న భర్త.. అసలేం జరిగిందంటే!

ఫొటోలో కనిపిస్తోన్న మహిళ పేరు దివ్య. తల్లిదండ్రులకు గారాల పట్టి. ఆడబిడ్డ అయినా సరే.. దేనిలో తక్కువ అని చూడలేదు. తమకున్నంతలో ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచారు. కళ్లల్లో పెట్టి చూసుకున్నారు. చదువే తన బిడ్డకు బంగారు భవిష్యత్తు అందిస్తుందని బలంగా నమ్మారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే బిడ్డను మాత్రం బాగా చదివించారు. దివ్య కూడా తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బాగా చదివి.. సాఫ్ట్‌వేర్‌ కొలువు సంపాదించుకుంది. తాము అనుకున్నట్లే బిడ్డను బాగా చదివించారు.. ఆమె కూడా తన కాళ్ల మీద తాను నిలబడగలిగేలా ఎదిగింది. ఇక తమ మీద ఉన్న ఏకైక బాధ్యత బిడ్డ పెళ్లి.

అందుకోసం తెలిసిన వారి ద్వారా విచారించి మంచి సంబంధం అని భావించి దివ్యకు పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. మంచి ఉద్యోగం, ప్రేమించే భర్త, రత్నాల్లాంటి బిడ్డలు.. ఇక తమ బిడ్డ జీవితానికి ఎలాంటి లోటు లేదని భావించారు. అయితే వారి ఆశలు అడియాసలు అయ్యాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు బతకాల్సిన బిడ్డ.. అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరులోని జోగుపాళ్యలో చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దివ్యకు ఎనిమిదేళ్ల క్రితం అనగా 2014లో అరవింద్‌ థానిక్‌ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. వివాహం అయిన కొన్నాళ్ల పాటు వీరి జీవితం బాగానే సాగింది. భార్యను ప్రేమగా చూసుకునేవాడు అరవింద్‌. అయితే కొన్నాళ్ల తర్వాత అతడు, అతడి తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు వచ్చింది. కట్నం తక్కువ ఇచ్చారంటూ.. దివ్యను సూటిపోటీ మాటలతో ఇబ్బంది పెట్టేవారు. మరింత కట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధించేవారు. దివ్య ఈ వేధింపులు గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది.

ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత దివ్య తమ గదిలోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకుంది. అరవింద్‌ వచ్చి తలుపు తీయమని ఎంత అడిగినా.. దివ్య స్పందించలేదు. దాంతో అతడు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. విషయం చెప్పాడు. వెంటనే దివ్య తల్లిదండ్రులు కూమార్తె ఇంటికి వచ్చారు. ఇక వారు వచ్చే సరికే.. గదిలో దివ్య మృతదేహం వేలాడుతూ కనిపించింది. తన భార్య ఆత్మహత్య చేసుకుందని అరవింద్‌ చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. దివ్య తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో అరవింద్‌ను అదుపులోకి తీసుకుని.. అతడిని విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి