iDreamPost

కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన విశ్వ నటుడు కమల్ హాసన్

ఇప్పటి తరానికి మహేష్ బాబు తండ్రిగా తెలుసు. కానీ ఒకప్పుడు మహేష్ ను మించిన క్రేజ్. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ కు పండుగే. జయప్రద, శ్రీదేవితో సినిమాలు చేస్తున్నారంటే.. నిర్మాతలకు కాసుల గలగలలు. మినిమం గ్యారెంటీ హీరో అంటే అతనే. ఆయన సూపర్ స్టార్ కృష్ణ.

ఇప్పటి తరానికి మహేష్ బాబు తండ్రిగా తెలుసు. కానీ ఒకప్పుడు మహేష్ ను మించిన క్రేజ్. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ కు పండుగే. జయప్రద, శ్రీదేవితో సినిమాలు చేస్తున్నారంటే.. నిర్మాతలకు కాసుల గలగలలు. మినిమం గ్యారెంటీ హీరో అంటే అతనే. ఆయన సూపర్ స్టార్ కృష్ణ.

కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన విశ్వ నటుడు కమల్ హాసన్

ఒకప్పటి తరం అగ్ర శ్రేణి నటుల్లో ఘట్టమనేని కృష్ణ ఒకరు. నట శేఖరుడిగా, సూపర్ స్టార్ కృష్ణగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనకు అశేషమైన అభిమానులు ఉన్నారు. నటుడిగానే కాకుండా స్టూడియో అధినేతగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. తొలుత చిన్న పాత్రలతోనే నిరూపించుకుని ఆ తరువాత తిరుగులేని స్టార్‌గా అవతరించారు. ఆయన చేయని ప్రయోగం లేదు. తొలి కౌబాయ్ మూవీ, తొలి ఫుల్ స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం వంటి సినిమాలే కాదూ.. జేమ్స్ బాండ్ తరహా కథల్లోనూ కనిపించారు. ఇక ఆయన నెలకొల్పిన రికార్డులు చెప్పనక్కర్లేదు. 350 సినిమాలు చేసిన తొలి హీరో కూడా ఈ బుర్రిపాలెం బుల్లోడే. ఏకంగా 45 సంవత్సరాలు విరామం తీసుకోకుండా (1965-2009) పని చేశారు.

1942లో గుంటూరు జిల్లాలోని తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలో పుట్టిన ఈ నటుడు.. గత ఏడాది నవంబర్ 15న తుది శ్వాస విడిచారు. ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. గత ఏడాది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినప్పటికీ.. ఆయనను స్మరించుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆయన జన్మ స్థలమైన బుర్రిపాలెంలో కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించారు. ఆ వేడుకకు కుమార్తెలు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు విశ్వ నటుడు కమల్ హాసన్. విజయవాడలోని గురు నానక్ కాలనీ కేడీజీవో పార్కులో ఏర్పాటు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి దేవినేని అవినాష్ సారథ్యంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం బెజవాడలో భారతీయుడు 2 షూటింగ్ నిమిత్తం వచ్చిన కమల్ హాసన్‌ను ఈ ఆవిష్కరణ వేడుకకు ఆహ్వానించారు అవినాష్. ఆ ఆహ్వానాన్ని మన్నించి.. ఈ కార్యక్రమానికి హాజరై.. విగ్రహావిష్కరణ చేశారు కమల్. దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ..తెలుగు ప్రజల అభిమాన నటుడైన కృష్ణ విగ్రహాన్ని బెజవాడ నడిబొడ్డులో ఆవిష్కరించడం ఆనందమన్నారు. ఆయన వారసత్వంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ కుమారుడు మహేష్ బాబు అటు సినీ రంగంలోనూ, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ తండ్రి పేరు నిలబెడుతున్నారని అన్నారు. కమల్ హాసన్ ఈ విగ్రహావిష్కరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. కాగా, బెజవాడతో కృష్ణకు విడదీయలేని అనుబంధం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి