iDreamPost

Kaathuvaakula Rendu Kaadhal సమంతా నయనతారల జోడి KRK

Kaathuvaakula Rendu Kaadhal సమంతా నయనతారల జోడి KRK

చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన KRK కన్మణి రాంబో ఖతీజా ఎట్టకేలకు ఈ నెల 28 విడుదలవుతోంది. తమిళంలో బీస్ట్ తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద మూవీ ఇదే. మొదటిసారి విజయ్ సేతుపతి ఇద్దరు భామల మధ్య నలిగిపోయే రొమాంటిక్ క్యారెక్టర్ చేశాడు. నిన్న రిలీజైన ట్రైలర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. నయనతారను పెళ్లి చేసుకుని సమంతాతో పడక పంచుకునే డిఫరెంట్ పాత్రలో మక్కల్ సెల్వన్ విశ్వరూపం చూడొచ్చని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇది సీరియస్ కాన్సెప్ట్ కాదు. సరదాగా గడిచిపోయే చిలిపి డ్రామా. మతి పోయే ట్విస్టులు కానీ యాక్షన్ ఎపిసోడ్లు కానీ ఏమి లేవు. నవ్వించడమే టార్గెట్ పెట్టుకుని తీశారు.

దీనికి దర్శకుడు విగ్నేష్ శివన్. నయన్ తో ఎప్పటి నుంచో సహజీవనంలో ఉంటూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ పెళ్లి అనే అధికారిక ముద్ర వేయించుకోవడానికి ఆలస్యం చేస్తున్న డైరెక్టర్ ఇతనే. అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన సూర్య గ్యాంగ్ తీసింది కూడా విఘ్నేష్ శివనే. ఈ KRKని బాలీవుడ్ స్టైల్ లో ప్రెజెంట్ చేసినట్టు కనిపిస్తోంది. ఖుషిలో సీన్ ని రిపీట్ చేయడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. కథ మొత్తం ఈ ముగ్గురు మీదే నడుస్తుంది. అయినా ఇలాంటి ఇద్దరు భామల కథలు ఇప్పటికి కొన్ని వందలు వేలు వచ్చి ఉంటాయి. మరి ఇందులో ప్రత్యేకత ఏంటో తెలియాలంటే మాత్రం ఇంకో అయిదు రోజులు వేచి చూస్తే సరిపోతుంది.

ఇదంతా బాగానే ఉంది కానీ ఆచార్యకు కేవలం ఒక రోజు ముందు మాత్రమే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగు మార్కెట్ ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరు. మొన్న ఈటి, వలిమై తరహాలో దీనికి ప్రత్యేకంగా తెలుగు టైటిల్ పెట్టకుండా తమిళంలోనే లాగించారు. అనుమానం రాకుండా క్యాప్షన్ లో ముగ్గురి పాత్రల పేర్లు పెట్టారు కానీ ఒరిజినల్ వెర్షన్ కు ఫిక్స్ చేసిన పేరు వేరు. సరే మన తెలుగు ప్రేక్షకులు ఎలాగూ సహృదయులు కాబట్టి సినిమా బాగుంటే ఇదేమి పట్టించుకోరు. ఒకపక్క చిరంజీవి ఆచార్య, మరోపక్క శ్రీవిష్ణు భళా తందనాన మధ్య ఈ ట్రిపుల్ లవ్ స్టోరీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. అనిరుద్ సంగీతమే దీనికి ప్రధాన బలంగా నిలుస్తోంది. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి