iDreamPost
android-app
ios-app

పవన్ కుక్కలాగా అమ్ముడుపోయాడు.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul, Pawan Kalyan: మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలానే తరచూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. అదే విధంగా తాజాగా మరోసారి పవన్ పై పాల్ ఫైర్ అయ్యారు.

KA Paul, Pawan Kalyan: మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలానే తరచూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హాట్ కామెంట్స్ చేస్తుంటారు. అదే విధంగా తాజాగా మరోసారి పవన్ పై పాల్ ఫైర్ అయ్యారు.

పవన్ కుక్కలాగా అమ్ముడుపోయాడు.. KA పాల్ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడిగా  తీవ్ర రూపం దాల్చింది. అల్పపీడనం ఏర్పడితేనే తుఫాన్ వస్తుంది.. కానీ ఏపీలో మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ లేక ముందే.. ఎలక్షన్ తుఫాన్ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార, వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనాల మధ్య మాటల యుద్ధ తీరాన్ని దాటింది. ఇదే సమయంలో నేనున్నానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా తరచూ ప్రత్యక్షమవుతున్నాడు. అయితే ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతుంటారు. ఇప్పటికే పవన్ పై అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు పవన్ కుక్కలాగా అమ్ముడుపోయాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో మత ప్రబోధకుడిగా ఎంతో ప్రాచూర్యం పొందిన ఆయన.. కొంతకాలం నుంచి రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. పోలింగ్ బూతుల వద్ద తిరుగుతూ సందడి చేశారు. అలానే ఇటీవల ఏపీ రాజకీయల గురించి ఎక్కువగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, చంద్రబాబును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా మరోసారి విశాఖపట్నం వేదికగా పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ విరుచుకపడ్డారు. ఏకంగా కుక్కలతో పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ..” నేను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటి అనేక విషయాల్లో బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసింది. ఎన్ని కేసులు పెట్టించుకుంటే.. మీకు మంచి పొజిషన్, తనతో అపాయిట్ మెంట్ ఇస్తానని లోకేశ్ చెప్పారు. నిన్ను కలవాలంటే.. కేసులు పెట్టుకోవాలా?. నన్ను మీ నాన్న చంద్రబాబు 22 సార్లు కలిశాడు. అలాంటి మేము నీ అపాయింట్ మెంట్  కోరేది ఏంది. ఇక పవన్ కల్యాణ్ అయితే మరీ దారుణంగా ఉన్నారు.

పవన్ కల్యాణ్, ఆ జనసేన 25 సీట్లకు కుక్కలాగే టీడీపీకి అమ్ముడుపోయారు. 25 సీట్ల కోసం చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు. జనసేన, టీడీపీలు బీజేపీకి తొత్తులుగా మారారు. ప్రజలను ఒక్కటే అడుగుతున్నాను మీకు మోదీ తొత్తులుగా కావాలా?” అని కేఎ పాల్ పాల్ ప్రశ్నించారు. గతంలోనూ పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారని, తమ దగ్గర ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంది తనతో వచ్చేయ్యమంటూ పవన్ కి పిలుపునిచ్చారు. అంతేకాదు పవన్ అభిమానులు కూడా తన ఫాన్స్ అయిపోవాలంటూ పాల్‌ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరి.. పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş