iDreamPost

Bigg Boss Issue: పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అరెస్ట్! ఇక నెక్స్ట్ రైతుబిడ్డేనా

బిగ్ బాస్ అయితే ముగిసింది గానీ.. ఆదివారం మొదలైన అల్లర్లు రేపిన కలకలం మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు.

బిగ్ బాస్ అయితే ముగిసింది గానీ.. ఆదివారం మొదలైన అల్లర్లు రేపిన కలకలం మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు.

Bigg Boss Issue: పల్లవి ప్రశాంత్ డ్రైవర్లు అరెస్ట్! ఇక నెక్స్ట్ రైతుబిడ్డేనా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ముగిసింది. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. తమ అభిమాన కంటెస్టెంట్ విన్న అయ్యాడు అనే ఆనందంలో ఫ్యాన్స్ శృతి మించి ప్రవర్తించారు. అన్నపూర్ణ స్టూడియో బయట నానా హంగామా చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. అమర్ దీప్ ఫ్యాన్స్- పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించి పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి మరింత మంది అరెస్టు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

బిగ్ బాస్ హిస్టరీలో ఈ సీజన్ దేశంలోనే టాప్ సీజన్ గా నిలిచిందని నాగార్జున చెప్పారు. ఉల్టా పుల్టాగా వచ్చిన ఈ షోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్నడూ లేని విధంగా కామన్ మ్యాన్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ గెలిచాడంటూ సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఈ ఆనందం కాస్త శృతి మించి రాగాన పడినట్లు అయ్యింది. అభిమానం పేరుతో మితిమీరి ప్రవర్తించారు. ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను మాత్రమే కాకుండా పోలీసుల వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్ దీప్, అశ్వినీ శ్రీ కార్లను పగలగొట్టారు. గీతూ రాయల్ కారును ధ్వంసం చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఈ మొత్తం అల్లర్లపై కేసులు నమోదు అయ్యాయి. జూబ్లీహిల్స్ స్టేషన్ లో ప్రశాంత్ మీద, అతని అభిమానుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్ పై అయితే 6 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

ఈ బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్టులు షురూ చేశారు. తాజాగా ప్రశాంత్ ఇద్దరు డ్రైవర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఏ4గా ఉన్న సాయి కిరణ్, ఏ5గా ఉన్న రాజులను పోలీసులు అరెస్టు చేశారంటున్నారు. పోలీసులు వద్దని వారించినా ప్రశాంత్ చెప్పాడని రెండోసారి కార్లను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరు తీసుకువచ్చిన ఇద్దురు డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ అల్లర్లకు సంబధించి బాధ్యులైన అందరినీ తప్పక అరెస్టు చేస్తాంమటున్నారు. ఇప్పటికే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను జల్లెడ పడుతున్నారు. అన్నపూర్ణ స్టూడియో బయట డిసెంబర్ 17న పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందనే పోలీసులు ముందుగా బిగ్ బాస్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారంట. అందుకే చాలాసేపు ప్రశాంత్ ను బయటకు పంపలేదంట. తర్వాత మెల్లగా ప్రశాంత్ ను వెనుక వైపు నుంచి పంపేశారు. కానీ, ప్రశాంత్ మాత్రం వెళ్లినట్లు వెళ్లి తిరిగి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు చేరుకున్నాడు. ర్యాలీ వద్దని చెప్పిన పోలీసులతో వాదనకు దిగాడు. ఒక రైతుబిడ్డకు మీరు విలువ ఇవ్వడంలేదంటూ వీడియోలు తీశాడు. బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి