iDreamPost
android-app
ios-app

స్కూల్ కు బొట్టుపెట్టుకుని వెళ్లిన విద్యార్థిని.. టీచర్ చేసిన పనికి అంతా షాక్!

స్కూల్ కు బొట్టుపెట్టుకుని వెళ్లిన విద్యార్థిని.. టీచర్ చేసిన పనికి అంతా షాక్!

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొందరు టీచర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారనే కారణంతో వారిపై ఇష్టమొచ్చినట్లుగా దాడి చేస్తున్నారు. ఇంకొందరు ఉపాధ్యాయులు అయితే.. చదువు పేరుతో బాలికలపై లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇకపోతే, ఝార్ఖండా్ లో ఇటీవల ఓ విద్యార్థిని నుదుటిపై బొట్టుకుని స్కూల్ కు వెళ్లింది. ఇది చూసిన ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్ రాంచీ పరిధిలోని ధన్ బాద్ ప్రాంతం. ఇక్కడే ఓ బాలిక తన తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేది. అయితే, ఈ విద్యార్థిని ఇటీవల నుదుటిపై బొట్టు పెట్టుకుని స్కూల్ కు వెళ్లింది. ఇది చూసిన ఉపాధ్యాయుడు ఆ బాలికను తీవ్రంగా కొట్టాడు. దీనిని ఆ విధ్యార్థిని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుంది. కూతురు అలా చేయడంతో మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటన రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారడంతో బాలల హక్కుల జాతీయ కమిషన్ సైతం స్పందించింది. ఆ స్కూల్ కు చేరుకుని ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదే కాకుండా.., చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జి సైతం స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైందని, ఆ స్కూల్ కు సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు కూడా లేదని గుర్తించారు. అనంతరం అధికారులు మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. ఇదే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విద్యార్థిని స్కూల్ కు బొట్టుపెట్టుకుని వెళ్లిందని కొట్టిన ఉపాధ్యాయుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: మంచి హోదాలో ఉండి ఆఫీసులో ఇవేం పనులు మేడం?

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş