iDreamPost

మంచి హోదాలో ఉండి ఆఫీసులో ఇవేం పనులు మేడం?

మంచి హోదాలో ఉండి ఆఫీసులో ఇవేం పనులు మేడం?

ఈ మధ్యకాలంలో కొందరు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. స్వప్రయోజనాల కోసం అధికారాన్ని వినియోగించుకుంటూ వృత్తికే మాయని మచ్చని తెస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అచ్చం ఇలాగే ఓ మహిళా అధికారి ఆఫీసులోనే ఆ పని చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మంచి హోదాలో ఉండి ఇలాంటి పనులు ఏంటి మేడం అని కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి ఈమె ఎవరు? ఆమె చేసిన నేరమేంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోలీసుల కథనం ప్రకారం.. ఈమె పేరు జానకి, ప్రస్తుతం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సెక్షన్ లో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే? ఇన్ స్పెక్టర్ జానకి శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే క్రమంలో ఆమె తన బుద్ది ఏంటో చూపించింది. ఈ వస్తువులు నీ వరకు చేరాలంటే ముందుగా రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ ఓ వ్యక్తిని డిమాండ్ చేసింది. ఆమె మాటలు విన్న అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో తెలియక సరే ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే, బాధితుడు ఇదే విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

ఇక వాళ్లు చెప్పినట్లుగానే ఆ బాధితుడు బుధవారం జానకికి రూ.20 వేలు ఇస్తుండగానే ఏసీబీ అధికారులు ఆ మహిళా అధికారిని ఆఫీసులోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా అధికారులు అంతా షాక్ గురయ్యారు. దీంతో పాటు ఏసీబీ అధికారులు ఆ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. ఈ వార్త తెలుసుకున్న స్థానిక వ్యక్తులు.. మంచి హోదాలో ఉండి ఇవేం పనులు మేడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్: రెచ్చిపోయిన దోపిడి దొంగలు! మరీ ఇంత దారుణమా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి