iDreamPost

‘జవాన్’ కోసం నయనతారకు అన్ని రూ.కోట్లు ఇచ్చారా?

  • Author singhj Published - 02:58 PM, Wed - 13 September 23
  • Author singhj Published - 02:58 PM, Wed - 13 September 23
‘జవాన్’ కోసం నయనతారకు అన్ని రూ.కోట్లు ఇచ్చారా?

ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘జవాన్’ మూవీ గురించే వినిపిస్తోంది. నార్త్ నుంచి సౌత్ వరకు అంతా షారుక్​ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కింగ్ ఖాన్ డ్యుయల్​ రోల్​లో నటించిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. షారుక్ కెరీర్​లో ఇప్పటిదాకా అతిపెద్ద హిట్టుగా ‘పఠాన్’ మూవీని చెప్పొచ్చు. రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ సినిమా ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. వరుస పరాజయాలు రావడంతో కొంత గ్యాప్ తీసుకున్న షారుక్.. ‘పఠాన్​’తో సూపర్బ్ కమ్​బ్యాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘పఠాన్’ రికార్డులను ‘జవాన్’ బ్రేక్​ చేయడం ఖాయంలా కనిపిస్తోంది.

‘జవాన్’ మూవీ నార్త్​తో పాటు సౌత్​లోనూ హల్​చల్​ చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ మూవీ రచ్చ రచ్చ చేస్తోంది. తెలుగు నాట మాత్రం ‘జవాన్’ హిందీ వెర్షన్​కు భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాలో షారుక్​ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించారు. అయితే ఈ మూవీలో ఆమె రెమ్యూనరేషన్​కు సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘జవాన్’ కోసం నయన్​కు భారీగా డబ్బుల్ని ముట్టజెప్పారట మేకర్స్. హీరోల రేంజ్​లో ఆమెకు పారితోషికాన్ని అందజేశారని సమాచారం. కింగ్​ ఖాన్​తో నటించేందుకు లేడీ సూపర్​స్టార్​ ఏకంగా రూ.11 కోట్లు తీసుకున్నారని వినికిడి.

ఒకవేళ నయనతారకు పదకొండు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చుంటే మాత్రం విశేషమనే చెప్పాలి. ఒక సౌత్ హీరోయిన్​కు బాలీవుడ్​లో అంత పారితోషికం ఇవ్వడం గొప్పేనని సినీ పండితులు అంటున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాలతో పాటు ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్​లో నటిస్తూ సూపర్​ స్టార్​డమ్ సంపాదించిన నయన్​కు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పే లేదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాక్సాఫీస్​ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్న ‘జవాన్’ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషల ఓటీటీ హక్కులు కలిపి రూ.250 కోట్లు ఆఫర్ చేశారట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో మేకర్స్​కే తెలియాలి.

ఇదీ చదవండి: ‘లియో’ తర్వాత అసలు కష్టాలు!

 

View this post on Instagram

 

A post shared by Filmylooks (@filmylooks)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి