iDreamPost
android-app
ios-app

జవాన్ మొబైల్ ఇష్యూ! చిరిగి చాటంత అయ్యిందే!

  • Author ajaykrishna Updated - 11:53 AM, Sat - 9 September 23
  • Author ajaykrishna Updated - 11:53 AM, Sat - 9 September 23
జవాన్ మొబైల్ ఇష్యూ! చిరిగి చాటంత అయ్యిందే!

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ జవాన్. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా.. తమిళ, తెలుగు, హిందీ భాషలతో పాటు పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే నుండే సూపర్ పాజిటివ్ టాక్ తో జవాన్ మూవీ.. బాక్సాఫీస్ ని షేక్ చేయడం మొదలు పెట్టేసింది. సినిమాలో షారుఖ్ డ్యూయెల్ రోల్ తో పాటు నయనతార గ్లామర్, దీపికా స్క్రీన్ ప్రెజెన్స్.. విజయ్ సేతుపతి విలనిజం.. సంజయ్ దత్ గెస్ట్ అప్పియరెన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. ఇలా అన్ని జవాన్ ని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించేసాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని.. ఫస్ట్ డే రూ. 129 కోట్ల కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.

ఇక జవాన్ సినిమాని జనాలు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో.. సినిమాలో ఒక్కో పాయింట్ ని వెలికి తీసి కాంట్రవర్సీ క్రియేట్ చేసే బ్యాచ్ కూడా అలాగే ఉంది. సినిమాలో పోలీస్ గెటప్ లో షారుఖ్ ఉపయోగించిన మొబైల్ గురించి సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేశారు నెటిజన్స్. ఒక సీన్ లో షారుఖ్.. చేతిలో పోకో(POCO) మొబైల్ వాడుతూ కనిపించాడు. దీంతో ఇప్పుడు ఆ సీన్ లో షారుఖ్ పోకో మొబైల్ పట్టుకోవడం హైలైట్ చేస్తూ నెట్టింట సెటైర్స్ వేస్తున్నారు. అంత మంచి సినిమాలో షారుఖ్ ని చూడటం వదిలేసి చేతిలో మొబైల్ చూసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. షారుఖ్ ఖాన్ రియల్‌మీ(Realme) బ్రాండ్ కి ప్రచారకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. రియల్ మీ, షావోమీ సబ్‌ బ్రాండ్ పోకో రెండూ చైనా కంపెనీలే. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలకు మార్కెట్ లో క్రేజ్ ఉంది. రియల్ మీ వదిలేసి.. షారుఖ్ పోకోని వాడటం ఏంటని అంటున్నారు. కానీ.. షావోమీ సబ్‌ బ్రాండ్ పోకోకి, జవాన్ నిర్మాతలకు మధ్య ఒప్పందం ఉందని సమాచారం. ఆ కారణంగానే షారుఖ్ జవాన్ లో పోకో యూస్ చేశాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో సన్నివేశాలను, మెసేజ్ ని గ్రహించకుండా ఇలా పనికిరాని విషయాలపై ఫోకస్ పెట్టడం ఏంటని కొంతమంది ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. జనరల్ గా యాక్టర్స్ సినిమాల్లో వాడే మొబైల్స్.. నిర్మాతల ఒప్పందంతోనే వాడతారట. ఇక సినిమాలో షారుక్ వాడిన వాడిన ఫోన్ పోకో ఎక్స్4 ప్రో అని చెబుతున్నారు. మరి జవాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet