Somesekhar
చివరి టెస్ట్ లో భాగంగా శుబ్ మన్ గిల్ తో జరిగిన గొడవపై నోరు విప్పాడు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్. మా ఇద్దరి మధ్య జరిగింది ఇదే అంటూ.. సీక్రెట్ వార్ ను బయటపెట్టాడు. మరి వీరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
చివరి టెస్ట్ లో భాగంగా శుబ్ మన్ గిల్ తో జరిగిన గొడవపై నోరు విప్పాడు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్. మా ఇద్దరి మధ్య జరిగింది ఇదే అంటూ.. సీక్రెట్ వార్ ను బయటపెట్టాడు. మరి వీరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.
Somesekhar
క్రికెట్ మ్యాచ్ ల్లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య కవ్వింపులు జరగడం అన్నది సర్వసాధారణమైన విషయమే. బౌలర్లు బౌన్సర్లతో దాడి చేస్తే.. బ్యాటర్లు సిక్సర్లతో కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు. ఈ సీన్స్ చూడ్డానికి ఫుల్ మజాను ఇస్తుంటాయి. ఇలాంటి సీనే ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన చివరి టెస్టు లో చోటుచేసుకుంది. టీమిండియా యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ కి ఇంగ్లండ్ స్టార్ పేసర్ అండర్సన్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగింది? అన్న ప్రశ్నకు గిల్ బయటకి చెప్పకపోవడమే మంచిది అంటూ ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఇదే అంటూ చెప్పుకొచ్చాడు అండర్సన్.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఇటీవలే ముగిసిన ఐదో టెస్ట్ లో శుబ్ మన్ గిల్-అండర్సన్ మధ్య చిన్నపాటి గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాగ్వాదంలో ఏం జరిగిందో మాత్రం వాళ్లిద్దరికే తెలుసు. ఇదే విషయాన్ని గిల్ ను అడిగితే.. ఆ సీక్రెట్ చాట్ ను బయటపెట్టకపోవడమే ఇద్దరికీ మంచిది అంటూ పేర్కొన్నాడు. దీంతో అంత రహస్యమైన మాటలు ఏంటబ్బా అని ఆడియన్స్ తలపట్టుకున్నారు. ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడుతూ.. అండర్సన్ ఇద్దరి మధ్య జరిగిన విషయం ఇదే అని చెప్పుకొచ్చాడు.
గిల్ తో జరిగిన గొడవపై అండర్సన్ మాట్లాడుతూ..”గిల్ సెంచరీ చేసిన తర్వాత అతడి దగ్గరికి వెళ్లి.. ఇండియాలో కాకుండా విదేశాల్లో నువ్వు రన్స్ కొట్టావా? అని అడిగాను. దీనికి గిల్.. నువ్వు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన టైమ్ వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత నెక్ట్స్ రెండు బంతులకే గిల్ ను ఔట్ చేశాను” అంటూ ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని బహిర్గతం చేశాడు. దీంతో ఇదేనా జరిగింది అంటూ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. కాగా.. శుబ్ మన్ గిల్ విదేశాల్లో విఫలమైన విషయాన్ని గుర్తు చేశాడు జిమ్మీ. అనుభవం గల అతడి బౌలింగ్ ఆడటంలో తరచుగా విఫలం అయ్యేవాడు గిల్. తొలి రెండు మ్యాచ్ ల్లో జిమ్మీ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. కానీ చివరి మ్యాచ్ లో మాత్రం అండర్సన్ బౌలింగ్ లో ముందుకు వచ్చి కొట్టిన స్ట్రైట్ సిక్స్ మాత్రం మ్యాచ్ కే హైలెట్. మరి గిల్-అండర్సన్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
James Anderson recalled the incident with Shubman Gill pic.twitter.com/blFsQeIQlz
— RVCJ Media (@RVCJ_FB) March 12, 2024
ఇదికూడా చదవండి: వీడియో: PSL లో మరో గొడవ.. ఈసారి పాక్ ప్లేయర్ vs ఇంగ్లండ్ ప్లేయర్!