iDreamPost

జల్సా + జనతా గ్యారేజ్ = ఆచార్య

జల్సా + జనతా గ్యారేజ్ = ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య కరోనా బ్రేక్ వల్ల షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ బ్రేక్ టైంని క్రైసిస్ చారిటి పనులతో పాటు మీడియాతో ఫోన్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్న చిరు తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి పలు ఆసక్తికరమైన సంగతులు వెలువరించారు. ఆ మధ్య ఓ పిట్ట కథ ఫంక్షన్ లో ఆచార్య టైటిల్ ని స్లిప్ అయిపోయి ప్రకటించేసిన చిరు ఇప్పుడు మరికొన్ని లీడ్స్ ఇచ్చారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్ర తరహాలో ఉంటుందని, సమాజ హితం కోసం తపించే ప్రొఫెసర్ గా తాను ఇందులో కనిపిస్తానని చెప్పారు. అది కూడా కొరటాల శివ సినిమానే కాబట్టి ఇలా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో నక్సలైట్ గా కనిపిస్తారనే టాక్ ఇంతకు ముందే వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫ్లాష్ అవుతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ చేసిన జల్సాలోనూ హీరో పూర్వాశ్రమంలో నక్సలైట్ గా నటించాడు. అక్కడ వచ్చే సీరియస్ నెస్ తో పాటు ఫన్ కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. పవన్ అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడూ అలాంటి రోల్ చేయలేదు.

ఇప్పుడు చిరంజీవి కూడా అదే తరహలో చేయనుండటం విశేషం. ఈ లెక్కన చూసుకుంటే జనతా గ్యారేజ్ ప్లస్ జల్సాను కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ మిక్స్ చేస్తే వచ్చేదే ఆచార్య అనే టైపులో అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. ఏది ఎలా ఉన్నా ఆచార్య మీద అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. కోవిడ్ 19 ప్రభావం లేకపోయి ఉంటె ఆగస్ట్ లో ఆచార్య వచ్చేందుకు రూట్ క్లియర్ అయిపోయేది. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి ఆ స్లాట్ ని ఆచార్య తీసుకునే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మరో రెండు భారీ సినిమాలకు స్పేస్ దొరుకుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి