iDreamPost

‘తారక్ 1422’ నెంబర్ మిస్టరీ వీడింది.. 9999 కాదని అందుకే ఈ నంబర్!

Jr NTR Broken His 9999 Sentiment: జూనియర్ ఎన్టీఆర్ కు కార్లు అంటే మక్కువ ఎక్కువ. అలాగే ఆ కార్లకు నెంబర్ అన్నా కూడా అంతే సెంటిమెంట్. ప్రతి కారుకి 9999 నెంబరే తీసుకుంటాడు. కానీ, మొదటిసారి 1422 నెంబర్ తీసుకున్నాడు. అలా ఎందుకు చేశాడో తెలుసా?

Jr NTR Broken His 9999 Sentiment: జూనియర్ ఎన్టీఆర్ కు కార్లు అంటే మక్కువ ఎక్కువ. అలాగే ఆ కార్లకు నెంబర్ అన్నా కూడా అంతే సెంటిమెంట్. ప్రతి కారుకి 9999 నెంబరే తీసుకుంటాడు. కానీ, మొదటిసారి 1422 నెంబర్ తీసుకున్నాడు. అలా ఎందుకు చేశాడో తెలుసా?

‘తారక్ 1422’ నెంబర్ మిస్టరీ వీడింది.. 9999 కాదని అందుకే ఈ నంబర్!

తారక్ పేరు వినగానే.. చక్కని స్మైలింగ్ ఫేస్, మంచి నటన, మంచి వాక్ పటిమ ఇవి మాత్రమే కాకుండా.. 9999 అనే ఫ్యాన్సీ నెంబర్ కూడా గుర్తొస్తుంది. తారక్ ఏ కారు తీసుకున్నా దానికి 9999 నెంబర్ ఉంటుంది. తారక్ ఫ్యాన్స్ హైదరాబాద్ రోడ్ల మీద 9999 నెంబర్ కారును చూశారు అంటే అది కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ దే అనుకుంటారు. కారులో ఉన్నాడా అని ఆతురతా అలా ఒకసారి తొంగి చూస్తూ ఉంటారు. అయితే తాజాగా తారక్ తీసుకున్న కారుకు 1422 నెంబర్ వచ్చింది. అదేంటి.. 9999 కాకుండా కొత్త బెంజ్ కారుకు తారక్ 1422 నెంబర్ తీసుకున్నాడు. అసలు ఆ నెంబర్ ఎందుకు తీసుకున్నాడు అని అంతా తెగ ఆలోచిస్తున్నారు. అయితే ఆ నెంబర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో బయటకు వచ్చింది.

తారక్ అనగానే 9999 ఫ్యాన్సీ నెంబర్ అందరికీ గుర్తొస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఇష్టంగా కొనుక్కున్న బెంజ్ కు 1422 నెంబర్ తీసుకున్నాడు.పైగా అది ఫ్యాన్సీ నెంబర్ సిరీస్ కూడా కాదు. కానీ, అలాంటి నెంబర్ అసలు ఎందుకు తీసుకున్నాడు అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఆ నెంబర్ తీసుకోవడం వెనుక దాగున్న కథ ఇదే అంటూ ఒక థియరీ సోషల్ మీడియాలోనే కాకుండా.. టాలీవుడ్ వర్గాల్లో కూడా వినిపిస్తోంది. ఈ కొత్త థియరీ విన్న తర్వాత తారక్ ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ఎందుకంటే ఆ నెంబర్ ని తారక్ తన కుమారుల పుట్టినరోజు తేదీలను బట్టి తీసుకున్నాడు. అంటున్నారు. ఇద్దరి బర్త్ డే డేట్లు వచ్చేలా ఇలా 1422 తీసుకున్నాడంట.

తారక్ పెద్ద కుమారుడు.. అభయ్ రామ్ జులై 22 2014న జన్మించాడు. భార్గవ్ జూన్ 14 2018లో జన్మించాడు. ఇప్పుడు వీళ్ల ఇద్దరి పుట్టినరోజు తేదీలు కలిసి వచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త బెంజ్ కారుకు ఈ 1422 సిరీస్ తీసుకున్నాడు అంటున్నారు. అయితే సరైన రీజన్ ఇదా అంటే తారక్ అధికారికంగా చెప్పే దాకా అవును అనలేం. కానీ, ఉన్నదాంట్లో పాజిబుల్ థియరీ మాత్రం ఇదే అంటున్నారు. ఇంక ఇదే సిరీస్ ని తారక్ కొనసాగిస్తాడా? లేక కేవలం బెంజ్ కారుతో ఆపేస్తాడో చూడాలి. ఈ కారుతో మాత్రం ఇద్దరు కుమారులకు మంచి అనుబంధం ఉంటుంది అంటున్నారు. మొత్తానికి 9999 సిరీస్ బ్రేక్ చేయడానికి గల కారణం మాత్రం ఇదే అంటున్నారు.

ఇంక గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు దేవర మూవీ, ఇటు వార్ 2లో కూడా పాల్గొంటున్నాడు. మరోవైపు తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి కూడా బిజీ బిజీగా వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు తారక్ పెద్ద స్కేచ్చే వేశాడు. హైదరాబాద్- ముంబయి తిరుగుతూ రెండు ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఫ్యాన్స్ దేవర గురించి ఎలా ఎదురుచూస్తున్నారో.. నార్త లో తారక్- హృతిక్ రోషన్ పోరాటాల కోసం హిందీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇకపై తారక్ నుంచి వచ్చే సినిమాలు అన్నీ కూడా మినిమం పాన్ ఇండియాలోనే ఉంటాయి. మరి.. 1422 థియరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి