iDreamPost

జగన్‌ నిర్ణయానికి అభినందనలు : అసదుద్దీన్‌

జగన్‌ నిర్ణయానికి అభినందనలు : అసదుద్దీన్‌

జాతీయ పౌర రిజిస్ట్రర్‌ (ఎన్‌ఆర్‌సీ)పై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం అభినందనీయమని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కొనియాడారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీకి ఒప్పుకోబోమని ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ పై విధంగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ను గత టీడీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అసదుద్దీన్‌ అన్నారు. ఒక రాష్ట్రాన్ని నడిపించడంలో అనేక ఇబ్బందులుంటాయని, ఒక నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదన్నారు. అయినా జగన్‌ పార్టీ, ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఇందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎన్‌ఆర్సీ కంటే ముందు ఎన్‌సీఆర్‌పై కూడా సీఎం జగన్‌ దృష్టి సారించాలని అసదుద్దీన్‌ కోరారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి