iDreamPost
android-app
ios-app

పవన్ 27కి హీరోయిన్లు ఫిక్స్

  • Published Feb 11, 2020 | 10:10 AM Updated Updated Feb 11, 2020 | 10:10 AM
పవన్ 27కి హీరోయిన్లు ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లాయర్ సాబ్ (రిజిస్టర్ చేసిన టైటిల్) షూటింగ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో పారలల్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో హీరోయిన్లు ఫిక్స్ అయ్యారట. ఒకరు జాక్వలిన్ ఫెర్నాండేజ్ కాగా మరొకరు దిశా పటాని. జాక్వలిన్ ఇటీవలే ప్రభాస్ సాహోలో స్పెషల్ సాంగ్ తో మెరిసిన సంగతి తెలిసిందే. దిశా పటానికి ఇది రెండో మెగా సినిమా. డెబ్యూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ లో వరుణ్ తేజ్ సరసన నటించి తెరకు పరిచయమయ్యింది.

దాని తర్వాతే దిశా బాలీవుడ్ కు వెళ్ళిపోయి ఎంఎస్ ధోనితో మొదటి హిట్టు అందుకుంది. ఆ తర్వాత భాగీ 2తో పేరు తెచ్చుకున్న దిశా సల్మాన్ తో చేసిన భారత్ కూడా బాగానే పేరు తీసుకొచ్చింది. ఇటీవలే విడుదలైన మలంగ్ లో దిశా అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన ఆఫర్ అంటే అంతకంటే కావలసింది తనకు ఏముంటుంది. ఇప్పుడీ వార్త పవన్ ప్యాన్స్ కు యమా కిక్ ఇస్తోంది. నిన్నటిదాకా కంచె భామ ప్రగ్య జైస్వాల్ పేరు వినిపించింది కానీ ఫైనల్ గా ఈ ఇద్దరూ ఓకే అయ్యారట.

తెలంగాణ పోరాట యోధుడు పండగ సాయన్న కథతో రూపొందుతున్నట్టుగా వార్త ఉంది కానీ యూనిట్ ఇప్పటిదాకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒకవేళ నిజమైతే అది ఇంకో పెద్ద సెన్సేషన్ అవుతుంది. సాయి మాధవ్ బుర్ర సంభాషణలు సమకూరుస్తున్న ఈ సినిమాకు కీరవాణి మొదటిసారి పవన్ మూవీకి సంగీతం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నట్టుగా టాక్. ఇప్పుడు జాక్వలిన్ ఫెర్నాండేజ్, దిశా పటాని ఓకే అయ్యారు కాబట్టి పవన్ 27కి కావాల్సిన గ్లామర్ ఫ్యాక్టర్ తోడైనట్టే. మరి అందాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఈ హాట్ బ్యూటీస్ కి క్రిష్ ఎలాంటి పాత్రలు డిజైన్ చేశాడో ప్రస్తుతానికి సస్పెన్స్

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş