iDreamPost
android-app
ios-app

జాక్ పాట్ కొట్టనున్న ‘భీష్మ’ దర్శకుడు ?

  • Published Mar 16, 2020 | 9:44 AM Updated Updated Mar 16, 2020 | 9:44 AM
జాక్ పాట్ కొట్టనున్న ‘భీష్మ’  దర్శకుడు ?

ఛలో రూపంలో డెబ్యూతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మ కూడా అంతే స్థాయిలో హిట్ కావడంతో ఇతని ఆనందం మాములుగా లేదు. నిన్న మెగాస్టార్ స్పెషల్ గా షో వేయించుకుని మరీ సినిమా చూసి ప్రత్యేకంగా అభినందించడం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెట్టుబడి-రాబడి-టాక్ లెక్కల్లో అల వైకుంఠపురములో తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ భీష్మకే వచ్చిందన్నది ట్రేడ్ మాట. ఇదిలా ఉండగా అన్ని సవ్యంగా కుదిరితే వెంకీ కుడుముల ఓ జాక్ పాట్ కొట్టబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.

ఇటీవలే మహేష్ ను కలిసి ఒక లైన్ చెప్పాడని అది నచ్చిన మహేష్ ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని వచ్చాక అది కనక నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పాడట. వెంకీ ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇది అధికారికంగా చెప్పకపోయినా ఫైనల్ నెరేషన్ ఓకే అయితే మాత్రం సినిమా కార్యరూపం దాల్చినా ఆశ్చర్యం లేదు. అసలే మహేష్ గురించి ఏ సమాచారం ఖచ్చితంగా రావడం లేదు. ఓసారేమో చిరంజీవి ఆచార్యలో స్పెషల్ రోల్ అన్నారు. లేదు ఎఫ్3 లో క్యామియో అని ఇంకోసారి అన్నారు. ఇంకోవైపు వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఇంకా తొలగనే లేదు.

సరిలేరు నీకెవ్వరు వచ్చి రెండు నెలలు దాటేసింది. ఇప్పటికీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాకపోవడం వల్ల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నచ్చాలే కానీ కొత్త పాత అనే తేడా లేకుండా ఆఫర్ ఇచ్చే మహేష్ కు నచ్చేలా కథ చెబితే మాత్రం వెంకీ కుడుముల ఈజీగా వంద కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతాడు. గతంలో ఇదే తరహాలో కొరటాల శివకు శ్రీమంతుడు ఛాన్స్ ఇచ్చిన ప్రిన్స్ దాని రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడూ అదే నమ్మకంతో వెంకీ కుడుములకు ఫుల్ వెర్షన్ తో రమ్మని చెప్పాడట. మరి ఈ కాంబో కార్యరూపం దాలుస్తుందో లేదో వేచి చూడాలి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Giriş