iDreamPost
android-app
ios-app

వీడియో: నూకరాజు- ఆసియా మధ్య ముదురిన గొడవలు.. బ్రేకప్?

Clarity On Nukaraju- Asiya Break Up: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లలో టీమ్ లీడర్ నూకరాజు కూడా ఒకరు. చాలా త్వరగా పాపులర్ అవ్వడం మాత్రమే కాకుండా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి నూకరాజు.. ఆసియాతో బ్రేకప్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

Clarity On Nukaraju- Asiya Break Up: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లలో టీమ్ లీడర్ నూకరాజు కూడా ఒకరు. చాలా త్వరగా పాపులర్ అవ్వడం మాత్రమే కాకుండా.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నాడు. అలాంటి నూకరాజు.. ఆసియాతో బ్రేకప్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

వీడియో: నూకరాజు- ఆసియా మధ్య ముదురిన గొడవలు.. బ్రేకప్?

బుల్లితెర కమెడియన్ నూకరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నూకరాజు.. జబర్దస్త్ అనే కామెడీ షోలో అడుగుపెట్టాక చాలా త్వరగా ఫేమస్ అయిపోయాడు. అలాగే టీమ్ లీడర్ కూడా అయ్యాడు. అలాగే జబర్దస్త్ షోలో లేడీ పార్టిసిపెంట్ గా వచ్చిన ఆసియాతో పరిచయం అవ్వడం, ఆ తర్వాత వారి మధ్య పరిచయం ప్రేమగా మారడం అందరికీ తెలిసిందే. అయితే ఆసియాకి నూకరాజుకి మధ్య గొడవలు పెరిగిపోయాయి అంటున్నారు. అంతేకాకుండా వాళ్ల మధ్య గొడవలు ముదిరి బ్రేకప్ కూడా జరిగిందంటూ వార్తలు వచ్చాయి. అందుకు కారణం లేకపోలేదు. ఆసియా పుట్టిన రోజుకి నూకరాజు కనీసం విష్ చేయకపోవడంతో ఈ విషయం వైరల్ అయ్యింది. దానికి నూకరాజు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు.

ఆసియాతో బ్రేకప్ అయ్యిందా అని కామెంట్స్, ఫోన్లు, మెసేజులు వస్తున్నట్లు నూకరాజు చెప్పాడు. ఎందుకంటే ఆసియా పుట్టిన రోజుకి నూకరాజు ఆమెకు విష్ చేయలేదు. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ఎలా ఎక్కడా ఒక పోస్టు కూడా పెట్టలేదు. అలా చేయకపోవడంతో వారి మధ్య ఏదో గొడవ జరుగుతోందని.. వాళ్లిద్దరు విడిపోయారని.. అందుకే నూకరాజు విష్ చేయలేదని చాలానే అభిప్రాయాలు, కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వారి మధ్య నిజంగానే గొడవలు జరిగిన విషయాన్ని నూకరాజు ఒప్పుకున్నాడు. అసలు వారి మధ్య ఏం జరిగింది? నిజంగానే విడిపోయారా? సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనా అనే విషయాలపై వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చాడు.

నూకరాజు వీడియోలో ఏం చెప్పాడంటే.. “ఆసియాకి నాకు గొడవలు జరిగాయని, మేము విడిపోయామని చాలానే వార్తలు వస్తున్నాయి. నేను ఆసియాకి విష్ చేయలేదని కామెంట్స్ రావడమే కాదు. కాల్స్ కూడా వచ్చాయి. అయితే మా మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమే. నిజంగానే మా మధ్య గొడవలు జరిగాయి. కానీ, మేమిద్దరం విడిపోయామని వస్తున్న వార్తలు మాత్రం తప్పు. మేము విడిపోలేదు. కానీ, జరిగిన గొడవకు మాత్రం వందకి వంద శాతం నేనే కారణం. ఇందులో ఆసియా తప్పు ఏమీ లేదు. అసలు ఏం జరిగిందంటే.. మా మధ్య గొడవ జరిగితే తనే వచ్చి మాట్లాడుతుంది. తప్పు నాదైనా కూడా తను వచ్చి మాట్లాడేదాకా నేను మాట్లాడను.  అలాగే ఒక గొడవ జరిగింది. మేము మాట్లాడుకోలేదు. నేను తర్వాత ఈవెంట్ కి దుబాయ్ వెళ్లాను.

10వ తారీఖు వెళ్తే.. 13వ తారీఖు వచ్చేస్తాను అనుకున్నాను. కానీ, అక్కడ లేట్ అయ్యింది. 15 వరకు అక్కడే ఉన్నాను. అయితే తను మెసేజ్ చేసినా కూడా నేనే రెస్పాండ్ కాలేదు. తను కాల్ చేసే మాట్లాడితేనే మాట్లాడాలి అన్నట్లు ఉండిపోయాను. కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. వచ్చాక కూడా తనే నాకు మెసేజ్ చేసింది. అయితే నా మీద కోపం లేదా అని అడిగాను. కోపం లేదు బాధ ఉంది అని చెప్పింది. అబ్బాయిలు ఎవరైనా తప్పు ఎవరిదైనా వెళ్లి మాట్లాడడండి. ఏం కాదు. వాళ్లే వచ్చి మాట్లాడాలి అని ప్రేమను దూరం చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. నేను ఆసియా బాగానే ఉన్నాం. తన బర్త్ డేకి విష్ చేయకపోయినా తనకి ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను” అంటూ నూకరాజు అసలు విషయం చెప్పాడు. వారి మధ్య ఇప్పుడు అంతా బాగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler