iDreamPost

జబర్దస్త్ కొత్త యాంకర్ సిరి హనుమంత్ లైఫ్ స్టోరీ!

ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ మారిపోయింది. సౌమ్య రావ్ స్థానంలోకి వచ్చి చేరింది బిగ్ బాస్ బ్యూటీ. ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీగా మారుతున్న ఈ నటి బుల్లితెరపై ప్రత్యక్షమవ్వడంతో.. ఏంటా సంగతి అని ఆరా తీస్తున్నారు. ఆమె మరెవ్వరో కాదూ సిరి హనుమంత్.

ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ మారిపోయింది. సౌమ్య రావ్ స్థానంలోకి వచ్చి చేరింది బిగ్ బాస్ బ్యూటీ. ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీగా మారుతున్న ఈ నటి బుల్లితెరపై ప్రత్యక్షమవ్వడంతో.. ఏంటా సంగతి అని ఆరా తీస్తున్నారు. ఆమె మరెవ్వరో కాదూ సిరి హనుమంత్.

జబర్దస్త్ కొత్త యాంకర్ సిరి హనుమంత్ లైఫ్ స్టోరీ!

బుల్లితెరపై కితకితలు పెట్టిస్తోన్న నెంబర్ వన్ కార్యక్రమం జబర్దస్త్. 2013లో మొదలైన ఈ షో ఇప్పటికీ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఎంతో మంది ఈ వేదికపై తమ టాలెంట్ నిరూపించుకుని.. స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. యాంకర్ అనసూయ కూడా ఈ షో నుండే బిజీయెస్ట్ నటిగా మారిపోయిన సంగతి విదితమే. ఈ షో కంటెస్టెంట్లు, జడ్జిలు మారినట్లుగా యాంకర్లు ఛేంజ్ కావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అనసూయ స్థానాన్ని సీరియల్ నటి సౌమ్యరావ్ భర్తీ చేస్తే.. ఇప్పడు సడెన్‌గా ఆ పొడుగు కాళ్ల సుందరి ప్లేస్‌ను రీ ప్లేస్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ, నటి సిరి హన్మంత్. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో కొత్త యాంకర్‌గా సిరి హనుమంత్‌ను పరిచయం చేశారు జడ్జి ఇంద్రజ.

బిగ్ బాస్ తొలి నుండి ఫాలో అవుతున్న వాళ్లకి సిరి హన్మంత్ గురించి చెప్పనక్కర్లేదు. విశాఖ పట్నంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. కష్టాలను మెట్లుగా పేర్చుకుని సక్సెస్ అనే భవనంలోకి అడుగుపెట్టింది. తండ్రి చిన్నప్పుడే దూరం కావడంతో తల్లి ఆమెను, సోదరుడ్ని కష్టపడి పెంచింది. ఏంబీఏ చదువుతున్నప్పుడు తనకు ఎంటర్ టైన్ మెంట్ రంగంపై ఆసక్తితో ఏర్పడటంతో హైదరాబాద్‌కు వచ్చేసింది. ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని మిస్ బ్యూటీ ఫుల్ స్మైల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తనను తాను నిరూపించుకునేందుకు న్యూస్ ప్రజెంటర్‌గా మారింది. యోన్, 99 టివి, టీ న్యూస్ ఛానల్స్‌లో వర్క్ చేసింది. అప్పుడు ఉయ్యాలా జంపాలా అనే సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది.

ఎవరో నువ్వు మోహిని, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి వంటి పలు సీరియల్స్‌లో మెరిసింది. అంతకన్నా ముందే పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. లాక్ డౌన్ లవ్, మేడమ్ సర్ మేడమ్ అంతే, రామ్ లీలా, సాప్ట్ వేర్ బిచ్చగాళ్లు, గందరగోళం, మై మెమొరీస్,అనుకోకుండా, భలే దొంగలు వంటి వెబ్ సీరిస్‌తో పాటు వరల్డ్ ఫేమస్ వైఫ్, వరల్డ్ ఫేమస్ హస్బెండ్, లవ్ అండ్ డౌట్, 4 డేస్ విత్ శ్రీ, మరుపురాని ప్రేమ కథ, థట్ వంటి వెబ్ సిరీస్, పొట్టి కథల్లో యాక్ట్ చేసింది చిలిపి నవ్వుల సుందరి. ఈ సమయంలోనే తనతో ఎక్కువ వెబ్ సిరీస్ చేసిన టీవీ నటుడు శ్రీహన్‌తో ప్రేమలో పడింది. అంతే కాకుండా హే సిరి పేరుతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తన వీడియోలు పోస్టు చేస్తూ ఎప్పుడు లైమ్ టైట్‌లో కనిపిస్తూ ఉండేది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో రివ్యూలకు యాంకర్ కూడా చేేసింది ఈ అమ్మడు.

చూసేందుకు చైనా బొమ్మలా కనిపిస్తుంది కానీ.. నవ్వితే.. చందమామ కూడా పనికి రాదు.  వెబ్ సిరీస్ ఫాలో అయ్యే వాళ్లకు ఆమె క్రేజ్ తెలుసు.. కానీ మిగిలిన వాళ్లకు సుపరిచయం అయ్యింది మాత్రం బిగ్ బాస్ 5లోనే. ఆమె ఆటలో సివంగిని తలపించేది. హరితేజ తర్వాత మంచి టాలెంట్ కంటెస్టెంట్ వచ్చింది అనుకున్న సమయంలో నెగిటివిటీ మూటకట్టుకుంది. తన తోటి వెబ్ సిరీస్ నటుడు.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి ఇంట్లో చేసిన రచ్చకు వీక్షకులు కూడా ఆమెపై కోపం వ్యక్తం చేశారు. శ్రీహాన్ రాకతో రియలైజ్ అయినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో వీరిద్దరి మధ్య నడిచిన ట్రాక్ కారణంగా.. షన్ను-దీప్తి సునయన, సిరి-శ్రీహాన్ విడిపోయారు. బయటకు వచ్చాక.. షన్ను, తాను స్నేహితులమని చెప్పుకున్నప్పటికీ.. ఈ ప్రేమలకు బ్రేకులు పడ్డాయి.

ఈ సమయంలో మానసికంగా కుంగిపోయి, ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు శ్రీహాన్ తనను క్షమించి.. మళ్లీ జీవితంలోకి ఆహ్వానించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సిరి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. కాగా, ఆమె ఓ కొడుకును కూడా పెంచుకుంటున్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుండి వచ్చాక ఆ ఇమేజ్ మరింత రెట్టింపు అయ్యింది. వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. పులి మేక, బీఎఫ్ఎఫ్ వంటి ఓటీటీ ఫిల్మ్‌తో అలరించింది ఈ అమ్మడు. కొడితే కుంభస్థలం కొట్టినట్లు.. ఏకంగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. జవాన్‌లో ఓ చిన్న పాత్రలో మెరిసింది ఈ భామ. సినిమాలతో బిజీ అవుతుందనుకున్న సమయంలో బుల్లితెరపై కనిపించి షాకిచ్చింది. జబర్దస్త్ కొత్త యాంకర్‌గా సిరి దర్శనమిస్తోంది. మరీ ఇందులోనే కొనసాగుతుందా.. కేవలం కొన్ని రోజులేనా అని తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి