iDreamPost

మంచి మనస్సు చాటుకున్న జబర్దస్త్ నూకరాజు -ఆసియా

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అవ్వడంతో పాటు సెలబ్రిటీలుగా మారిపోయారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలు కొల్లగొడుతున్నారు. తమ కామెడీ టైమింగ్స్ తో కితకితలు పెడుతున్న టీం లీడర్స్ లో ఒకరు నూకరాజు..

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అవ్వడంతో పాటు సెలబ్రిటీలుగా మారిపోయారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలు కొల్లగొడుతున్నారు. తమ కామెడీ టైమింగ్స్ తో కితకితలు పెడుతున్న టీం లీడర్స్ లో ఒకరు నూకరాజు..

మంచి మనస్సు చాటుకున్న జబర్దస్త్ నూకరాజు -ఆసియా

బుల్లితెర కామెడీ షోల్లో అలరించే ట్విన్ ధారావాహికలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబరస్త్. గురు, శుక్రవారాల్లో ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఈ కామెడీ షోలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారు. టీవీ చూడని వారు సైతం.. ఈ షోలను చూసి హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఈ నవ్వుల షోల ద్వారా ఎంతో మంది సామాన్యులు.. ఫేమస్సైన సంగతి విదితమే. ఎంతో మందికి పేరు తెచ్చింది ఈ షో. కొన్నేళ్ల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ కామెడీ షో ద్వారా సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. బుల్లితెర నుంచి వెండితెరపై కూడా అవకాశాలను కొల్లగొడుతూ బిజీ బిజీగా మారిపోతున్నారు. ఇందులో టీమ్ లీడర్స్, కంటెస్టెంట్లు మారుతూ వస్తున్నారు. తమదైన కామెడీతో కితకితలు పెడుతున్నారు.

అలాంటి వారిలో నూకరాజు ఒకరు. పటాస్ నుండి జబర్దస్త్‌ లోకి దూసుకు వచ్చిన టాలెండెట్ నటుడు అతడు. నాన్ స్టాప్ నూకరాజు పేరుతో టీం లీడర్ అయ్యాడు. తనదైన కామెడీ పంచులతో నవ్విస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో ప్రపంచ యాత్రికుడు (అన్వేష్) గెటప్‌ లో చేసిన స్కిట్ నవ్వులు పువ్వులు తెప్పించిన సంగతి విదితమే. అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఫేమస్ అయ్యాడు. అతని ఫ్రెండ్ ఆసియా కూడా జబర్దస్త్, ఇతర షోలతో కలిసి అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ పడి సక్సెస్ చూసినా.. వీరికి కష్టం విలువ బాగా తెలుసు. ఇప్పుడు కష్టంలో ఉన్న ఓ మహిళకు సాయం చేసి పెద్ద మనస్సును చాటుకున్నారు ఈ జంట.

హైదరాబాద్‌లో గీత అనే యువతి ర్యాపిడో నడుపుతూ పిల్లల్ని, కుటుంబాన్ని పోషిస్తుంది. భర్తకు యాక్సిడెంట్ అయినా కూడా అధైర్యపడకుండా.. ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని పోషించాలని ర్యాపిడో నడుపుతుంది. ఈ ఫ్యామిలీకి సాయం అందించారు నూకరాజు-ఆసియా. ఆమె ఇంటికి వెళ్లి.. వారి బాగోగులు తెలుసుకున్నారు. తాను ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను వారితో పంచుకుంది. ఆమెలో ధైర్యం నింపుతూ.. కొంత అమౌంట్ ఇచ్చారు నూకరాజు-ఆసియా. వారి సాయానికి ఆ మహిళ కంటతడి పెట్టుకుని.. వారి కాళ్లపై పడిపోయింది. అలాగే ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించాలనుకుంటే నంబర్లు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నారు ఈ ఇద్దరు.  తమ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారంటూ కన్నీటి పర్యంతమైంది గీత. కాగా, ఈ జంట మంచి పనిని కొనియాడుతున్నారు నెటిజన్లు.  మరి నూకరాజు-ఆసియా చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by jabardast Nukaraju (@jabardastnukaraju)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి