iDreamPost
android-app
ios-app

మొదలై వారం కాలేదు.. మహాలక్ష్మీ స్కీం పేరిట స్కాం!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏవైతే హామీలను గుప్పించిందో.. వాటిని ఇప్పుడు అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏవైతే హామీలను గుప్పించిందో.. వాటిని ఇప్పుడు అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో..

మొదలై వారం కాలేదు.. మహాలక్ష్మీ స్కీం పేరిట స్కాం!!

నకిలీ ఆహార పదార్ధాలు, నకిలీ వస్తువులు మార్కెట్‌లో విచ్చల విడిగా లభిస్తుంటాయి. బ్రాండ్ ఉత్పత్తులకు ఏ మాత్రం తీసిపోని విధంగా కేటుగాళ్లు వస్తువులను తయారు చేసి.. మార్కెట్‌లో సొమ్ము చేసుకుంటూ ఉంటారు. తెలియని జనం.. అవే నిజమని నమ్మేస్తూ ఉంటారు. వాటిని కొంటుంటారు. అయితే ఇప్పుడు మోసగాళ్లు.. ఏకంగా ప్రభుత్వ పథకాన్ని మార్గంగా ఎంచుకున్నారు. అదీ కూడా మహిళలను టార్గెట్ చేస్తూ. ఇటీవల తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సంగతి విదితమే. హామీ ఇచ్చినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. త్వరలో మహాలక్ష్మి అనే కార్డును జారీ చేయనుంది.

దీన్నే అదునుగా తీసుకున్న కేటుగాళ్లు.. బిజినెస్ చేసుకునేందుకు ఏకంగా ఆ కార్డులను ముద్రించేశారు. మార్కెట్లోకి తీసుకు వచ్చి అమ్ముతున్నారు. ఒక్కో కార్డును వంద రూపాయల చొప్పున సేల్ చేస్తున్నారు. ఈ కార్డు ఉంటేనే ఆర్టీసీ ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతినిస్తుందంటూ.. వాటిని మహిళలకు అంటగడుతున్నారు. ఇది మోసం అని తెలియని మహిళలను ఆ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. పింక్ కార్డు రూపంలో అమ్ముతున్న దీనిపై కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు అని రాసి ఉంది. అదేవిధంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ప్రతి నెల రూ. 2,500, గ్యాస్ సిలిండర్ రూ.500 అని ముద్రించి ఉండటంతో పాటు సోనియా గాంధీ సంతకం కూడా ఉండటం గమనార్హం.

ఇక కార్డుకు రెండో వైపు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోటో, పార్టీ గుర్తు కూడా ఉంది. ఎవరెవరికి కార్డు కావాలో, వారి పేరుతో ముద్రించి ఇవ్వడం కొసమెరుపు. అయితే ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొందరు. అయితే అధికారులు చెప్పిన దాని ప్రకారం.. ఎలాంటి కార్డులు జారీ చేయలేదు. ఇంకా ఆ పథకాల, వాటి అమలులో విధి విధానాలు కూడా రూపొందించలేదు. దీనికి కొంత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందని పేర్కొన్నారు. మార్కెట్‌లో లభ్యమౌతున్న కార్డులు నకిలీవని, వాటిని కొనుగోలు చేయవద్దని సూచించారు అధికారులు. ఈ కార్డులు తయారు చేస్తున్న ముఠాను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం మొదలై.. పట్టుమని వారం కూడా కాలేదు.. ఇలా నకిలీ ఐడీ కార్డులు మార్కెట్లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి