iDreamPost

అయోధ్య రామమందిరానికి BJP ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.1 మాత్రమేనా?

  • Published Jan 21, 2024 | 4:15 PMUpdated Jan 23, 2024 | 1:21 PM

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు.. మోదీ ప్రభుత్వం గుడి కోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు. మరి వాస్తవం ఏంటి అంటే..

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు.. మోదీ ప్రభుత్వం గుడి కోసం 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు. మరి వాస్తవం ఏంటి అంటే..

  • Published Jan 21, 2024 | 4:15 PMUpdated Jan 23, 2024 | 1:21 PM
అయోధ్య రామమందిరానికి BJP ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.1 మాత్రమేనా?

ఎన్నో వందల ఏళ్లుగా అయోధ్య రామ మందిరం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. అయోధ్య మందిర ప్రారంభోత్సవం కార్యక్రమం పట్ల హిందువులంతా హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాత్రం.. మందిరం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా.. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది ఆలయాలు కాదు.. ఆస్పత్రులు, బడులు, ఉపాధి కల్పించే కంపెనీలు అంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాక మోదీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేసింది అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ డబ్బుని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు కదా అని విమర్శలు చేస్తున్నారు. మరి మోదీ ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలను నిజంగానే దుర్వినియోగం చేసిందా? వాస్తవమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నో వందల ఏళ్లుగా హిందువులు అయోధ్య రామ మందిరం కోసం ఎదురు చూస్తుండగా.. జనవరి 22న వారి కల సాకారం అయ్యింది. అయోధ్య మందిర ప్రారంభోత్సవం కార్యక్రమం పట్ల హిందువులంతా హర్షం వ్యక్తం చేయగా.. కొందరు మాత్రం.. మందిరం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా.. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది ఆలయాలు కాదు.. ఆస్పత్రులు, బడులు, ఉపాధి కల్పించే కంపెనీలు అంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాక మోదీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం కోసం ప్రజల డబ్బు దుర్వినియోగం చేసింది అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఆ డబ్బుని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు కదా అని విమర్శలు చేస్తున్నారు

మందిరం కోసం మోదీ ప్రభుత్వం 1800 కోట్లు?

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం ఏకంగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే అలా విమర్శలు చేసే వారు ముందుగా ఒక అంశం తెలుసుకోవాలి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ప్రతి రూపాయిని ప్రజల వద్ద నుంచి విరాళాల రూపంలో సేకరించడం జరిగింది. అయోధ్య రామ మందిరం కోసం మోదీ ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలు కాదు కదా.. కనీసం 18 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు.

బీజేపీ ఇచ్చింది 1 రూపాయి..

కేవలం ఒకే ఒక్క రూపాయి భూమి పూజ రోజున ఇవ్వడం జరిగింది. అదే బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే 11 లక్షల రూపాయలు తన వ్యక్తిగత సంపాదన నుంచి ఇచ్చారు. మందిర నిర్మాణం కోసం ఆలయం ట్రస్ట్‌ విరాళాల కోసం పిలుపునివ్వగా.. స్వచ్ఛందంగా కోట్ల మంది ప్రజలు కదిలి వచ్చి.. తమ శక్తి మేర మందిరానికి విరాళం ఇచ్చారు. ఆఖరికి భిక్షగాళ్లు కూడా మందిర నిర్మాణం కోసం విరాళాలు పంపారు.

భారీ ఎత్తున విరాళాలు..

మందిరం నిర్మాణం ప్రారంభించిన తర్వాత విరాళాల సేకరణకు పిలుపునిచ్చారు అయోధ్య ట్రస్ట్‌ సభ్యులు. కేవలం 45 రోజుల్లోనే 10 కోట్ల మందికి పైగా మందిరం కోసం విరాళాలు అందించారు. ఈ 45 రోజుల్లోనే 2500 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఇదే విషయం విశ్వహిందూ పరిషత్ కేంద్ర ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరుల సమావేశంలో స్వయంగా వెల్లడించారు.

అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి జనవరి 14 వ తేదీ 2021లో ప్రపంచంలోనే అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టి ఫిబ్రవరి 27, 2021న ముగిసిందని తెలిపారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి సుమారు రూ. 1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఫిబ్రవరి 5, 2020 నుంచి మార్చి 31, 2023 మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ రూ. 900 కోట్లు ఖర్చు చేసిందని గత ఏడాది రామ జన్మ భూమి ట్రస్ట్ ప్రకటించింది.

మందిర వల్ల వేల కోట్ల వ్యాపారం..

ఆయా ప్రదేశాలను బట్టి.. అక్కడున్న ప్రాముఖ్యతను బట్టి ఆలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్ధనా మందిరాలను భారీ వ్యయంతో నిర్మిస్తుంటారు. అయితే కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటారు. అంత భారీ మొత్తం ఖర్చు పెట్టి ప్రార్థన మందిరాలు నిర్మించే బదులు ఆ డబ్బుతో పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టవచ్చు కదా అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. అయితే వారికి తెలియంది ఏంటంటే.. ఈ ప్రార్థనా మందిరాల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. వాటి వల్ల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆలయం నుంచి, పరోక్షంగా ఆలయ చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. పైగా ఇది ఒక్కసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదు. నిత్యం వందలు, వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి రోజు వ్యాపారం జరుగుతుంటుంది.. అలా ప్రభుత్వానికి ఏడాదంతా రాబడి వస్తుంది. ఆ ఆదాయాన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

ఒక్క తిరుపతి ఆలయం నుంచే డబ్బు, బంగారం, ఇతర కానుకల ద్వారా రోజుకు 3 నుంచి 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఏడాదికి 1000 నుంచి 1200 కోట్లు వస్తుంది. ఈ లెక్కన దేశంలో ఉన్న ఆలయాల నుంచి ఎంత వస్తుందో అంచనా వేయచ్చు. ఈ సొమ్మంతా దేవాదాయ శాఖకు వెళ్తుంది. ఈ డబ్బునే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుంది. అయోధ్య రామ మందిరం విషయంలో కూడా జరిగేది ఇదే. అంతేకాదు.. అయోధ్య రామ మందిరం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఎంతోమంది చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది. నిత్యం కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ప్రత్యక్షంగా అయోధ్య రామ మందిరం నుంచే కాకుండా పరోక్షంగా జరిగే వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో సమకూరుతుంది.

ఈ మందిరం వల్ల యూపీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీని వల్ల ఈ ఏడాది ముగిసేసరికి టూరిజం ద్వారా 4 లక్షల కోట్ల రూపాయల మార్క్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా యూపీ ప్రభుత్వానికి 20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. మందిరం నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన షాపులు, హోటల్స్‌, వంటి వాటి వల్ల ఎంత మంది ఉపాధి పొందుతున్నారు.. పర్యాటక పరంగా ప్రభుత్వానికి ఎంత ఆదాయం రాబోతుంది. ఇవేమీ తెలియకుండా 1800 కోట్లు దుర్వినియోగం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం రామ మందిరం కోసం ఖర్చు చేసింది ఒక్క రూపాయి మాత్రమే. ఇక హిందువులు ఇచ్చిన విరాళాల ద్వారా అంతా సద్వినియోగం కోసమే. మరి అయోధ్య రామ మందిరం నిర్మాణం వల్ల ఏం ఉపయోగం ఉంది అని కామెంట్స్ చేసేవారికి ఈ వీడియోని షేర్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి