Nidhan
ఐపీఎల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్‌స్టర్స్ ఆటను చూసేందుకు అందరూ రెడీ అయిపోయారు. అదే తరుణంలో పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా అందరి అటెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్‌స్టర్స్ ఆటను చూసేందుకు అందరూ రెడీ అయిపోయారు. అదే తరుణంలో పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా అందరి అటెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్-2024కు అంతా రెడీ అయిపోయింది. మరో రెండ్రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ మొదలవనుంది. ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడానికి ప్లేయర్లు అందరూ రెడీ అవుతున్నారు. తమ అద్వితీయ ఆటతీరుతో ప్రేక్షకుల మనసు దోచుకుందామని చూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లతో పాటు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్‌స్టర్స్ వరకు.. అలాగే గ్లెన్ మాక్స్వెల్, ప్యాట్ కమిన్స్ లాంటి ఫారెన్ క్రికెటర్స్ దాకా అందరూ ఈ సీజన్‌పై తమ మార్క్ వేయాలని చూస్తున్నారు. అభిమానులు కూడా వీళ్ల గేమ్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ స్టార్స్ ఎప్పుడైనా సత్తా చూపిస్తారు. కానీ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న అన్క్యాప్డ్ ప్లేయర్లు ఎలా ఆడతారనేది కీలకంగా మారింది. ఈసారి నలుగురు డొమెస్టిక్ క్రికెటర్స్ అందరి ఫోకస్‌ను తమ వైపునకు తిప్పుకుంటున్నారు.
ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో భారీ మొత్తాలు దక్కించుకొని రికార్డులు కొల్లగొట్టారా నలుగురు కుర్రాళ్లు. వాళ్లకు ఫైనల్ ఎలెవన్‌లో ఛాన్స్ వస్తుందో? రాదో? చెప్పలేం. కానీ వాళ్ల ఫామ్‌ను బట్టి అవకాశం వస్తే మాత్రం ఇరగదీయడం పక్కా. ఆ నలుగురు ప్లేయర్లు ఎవరు? వాళ్ల మీద ఫ్రాంచైజీలు అంత మొత్తంలో డబ్బులు ఎందుకు వెదజల్లాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సమీర్ రిజ్వీ
మినీ ఆక్షన్‌లో ఓ డొమెస్టిక్ ప్లేయర్ కోసం ఏకంగా రూ.8.40 కోట్లు ఖర్చు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచులు మాత్రమే ఆడిన అతడిలో టాలెంట్‌కు ఫిదా అయిన సీఎస్కే మేనేజ్మెంట్ ఈ రిస్క్ చేసిందని తెలుస్తోంది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. సమీర్ రిజ్వీ. సీకే నాయుడు ట్రోపీలో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున సెంచరీ బాదిన రిజ్వీ.. అంకుముందు యూపీ టీ20 లీగ్‌లో మరో 2 సెంచరీలు కొట్టాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు ప్లేసులో ఈ 20 ఏళ్ల కుర్ర బ్యాటర్‌ను ఆడించాలనేది చెన్నై ప్లానింగ్‌గా కనిపిస్తోంది.
షారుక్ ఖాన్
గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగుతున్న షారుక్ ఖాన్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఆడిన అన్క్యాప్డ్ ప్లేయర్ ఇతను. 2021 నుంచి 2023 వరకు పంజాబ్ కింగ్స్‌కు షారుక్ ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటిదాకా 33 మ్యాచులు ఆడిన అతడు 426 రన్స్ చేశాడు. మినీ వేలానికి ముందు అతడ్ని పంజాబ్ వదులుకుంది. ఆక్షన్‌లో రూ.7.60 కోట్లు పెట్టి గుజరాత్ షారుక్‌ను దక్కించుకుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టడం, బౌలింగ్ చేయగలగడంతో అతడ్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. టీఎన్‌పీఎల్‌లో ఏకంగా 17 వికెట్లు పడగొట్టాడతను. బిగ్ షాట్స్ కొట్టడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు.
కుమార్ కుశాగ్ర
ఈసారి ఐపీఎల్లో అందరి అటెన్షన్ తీసుకుంటున్న మరో ప్లేయర్ కుమార్ కుశాగ్ర. ఝార్ఖండ్‌కు చెందిన ఈ యంగ్ బ్యాటర్.. 19 ఏళ్లకే రంజీల్లో డబుల్ సెంచరీ బాదాడు. 19 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 1,245 రన్స్ చేశాడు. ఇతడ్ని రూ.7.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన కుశాగ్ర.. గత సీజన్లో నాలుగు మ్యాచులే ఆడి 33 రన్స్ చేశాడు. ఈసారి ఛాన్స్ వస్తే సత్తా చాటేందుకు అతడు సై అంటున్నాడు.
శుభమ్ దూబె
టాలెంట్ ఉన్న యంగ్‌స్టర్స్‌ను పసిగట్టి టీమ్‌లో చేర్చడంలో అందరికంటే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ముందు వరుసలో ఉంటుంది. పెద్దగా ఫస్ట్ క్లాస్ ఎక్స్‌పీరియెన్స్ లేని ఓ యువ బ్యాటర్‌ను ఏకంగా రూ.5.80 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది రాజస్థాన్. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. శుభమ్ దూబె. 3 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 75 పరుగులు చేసిన శుబ్మ్లోని ప్రతిభను రాజస్థాన్ గుర్తించింది. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్న ఈ బ్యాటర్.. 20 మ్యాచుల్లో 485 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 30 సిక్సులు, 26 ఫోర్లు ఉన్నాయి. బిగ్ షాట్స్ కొట్టే సామర్థ్యమే అతడ్ని ఈ స్థాయికి చేర్చింది.
రాబిన్ మింజ్
ఝార్ఖండ్ నుంచి వచ్చిన మరో ఆణిముత్యమే రాబిన్ మింజ్. ఇతడ్ని గుజరాత్ టైటాన్స్ రూ.3.60 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. అయితే కొన్ని రోజుల కింద రోడ్డు ప్రమాదానికి గురైన మింజ్.. ఈ సీజన్లో ఆడే ఛాన్సులు తక్కువ. రాబిన్ తండ్రి మాత్రం తన కొడుకు త్వరలో కమ్‌బ్యాక్ ఇస్తాడని అంటున్నారు. ఒకవేళ అతడు ఆడితే మాత్రం ప్లేయర్ టు వాచ్ లిస్టులో ఒకడిగా ఉంటాడు. మరి.. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ల ఆటను చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: బంధం తెగిపోయింది.. అతనితో ఇక శత్రుత్వమే: రోహిత్ శర్మ