iDreamPost

బంధం తెగిపోయింది.. అతనితో ఇక శత్రుత్వమే: రోహిత్‌ శర్మ

  • Published Mar 20, 2024 | 12:16 PMUpdated Mar 20, 2024 | 12:18 PM

Rohit Sharma, Mumbai Indians: ఈ సారి ఐపీఎల్‌ ఆడటం లేదంటూ రోహిత్‌ అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. కానీ, క్షణాల్లో ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. ప్రస్తుతం ముంబై టీమ్‌లో చేరాడు. అయితే.. తాజాగా రోహిత్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Mumbai Indians: ఈ సారి ఐపీఎల్‌ ఆడటం లేదంటూ రోహిత్‌ అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. కానీ, క్షణాల్లో ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. ప్రస్తుతం ముంబై టీమ్‌లో చేరాడు. అయితే.. తాజాగా రోహిత్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 20, 2024 | 12:16 PMUpdated Mar 20, 2024 | 12:18 PM
బంధం తెగిపోయింది.. అతనితో ఇక శత్రుత్వమే: రోహిత్‌ శర్మ

ఐపీఎల్‌ 2024 సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 22 నుంచి చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ బాగా ఫోకస్‌గా ఉన్నారు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా కాకుండా.. ఒక ఆటగాడిగా మాత్రమే టీమ్‌లో కొనసాగుతున్నాడు. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ చేసిన ఒక పోస్ట్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘ఫ్యామిలీ టైమ్‌ ముగిసిపోయింది.. ఇక రైవలరీ మొదలైపోయింది’ రోహిత్‌ శర్మ ఒక ట్వీట్‌ చేశాడు. అయితే అది ఒక యాడ్‌కు రోహిత్‌ పెట్టిన క్యాప్షన్‌. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటించిన ఈ యాడ్‌లో.. సునీల్‌ శెట్టి, రోహిత్‌ క్లోజ్‌గా ఉంటారు. అల్లుడైన కేఎల్‌ రాహుల్‌ వచ్చి పలకరించినా సునీల్‌ శెట్టి పట్టించుకోకుండా.. ఐపీఎల్‌ పూర్తి అయ్యేంత వరకు రోహిత్‌ శర్మకే తన సపోర్ట్‌ అంటూ చెబుతాడు. ఈ యాడ్‌ సంగతి పక్కన పెడితే.. దీనికి రోహిత్‌ పెట్టిన క్యాప్షన్‌ హైలెట్‌గా మారింది. ఆ యాడ్‌ గురించి పెట్టినా.. పరోక్షంగా ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ను, అలాగే హార్ధిక్‌ పాండ్యాను టార్గెట్‌ చేసి.. రోహిత్‌ ఈ క్యాప్షన్‌ పెట్టినట్లు ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తనను చెప్పాపెట్టకుండా తీసేయడంపై రోహిత్‌ సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా.. ఫ్యామిలీతో బంధం తెగిపోయిందని పెట్టినట్లు క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే.. ముంబై టీమ్‌ని ఎంఐ ఫ్యామిలీ అంటూ ఉంటారు. అందుకే ఫ్యామిల్‌ టైమ్‌ ఓవర్‌ అని కేఎల్‌ రాహుల్‌ను మెన్షన్‌ చేసి.. పరోక్షంగా మాత్రం ముంబై మేనేజ్‌మెంట్‌ను టార్గెట్‌ చేశాడు. ఇక పాండ్యాతో, ముంబై మేనేజ్‌మెంట్‌తో శత్రుత్వం మొదలైందని చెప్పకనే చెప్పాడు. అయిష్టంగానే రోహిత్‌ ఈ సీజన్‌లో ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే. అప్పటికీ.. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆడటం లేదని కూడా రోహిత్‌ ఒక పోస్ట్‌ కూడా పెట్టాడు. కానీ, ఏమైందో ఏమో కానీ వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసి.. ముంబై టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు. మరి ఒక యాడ్‌పై పరోక్షంగా రోహిత్‌ రియాక్ట్‌ అయ్యాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి