iDreamPost
android-app
ios-app

రాజస్థాన్​తో చావోరేవో మ్యాచ్​.. ఇప్పటికైనా SRH ఆ రాక్షసుడ్ని దింపుతుందా?

  • Published May 23, 2024 | 10:23 PM Updated Updated May 24, 2024 | 1:19 AM

క్వాలిఫయర్-1లో ఓడిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. రాజస్థాన్ రాయల్స్​తో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య చెన్నై వేదికగా రేపు క్వాలిఫయర్-2 జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్ చేరుకుంటుంది.

క్వాలిఫయర్-1లో ఓడిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. రాజస్థాన్ రాయల్స్​తో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య చెన్నై వేదికగా రేపు క్వాలిఫయర్-2 జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్ చేరుకుంటుంది.

  • Published May 23, 2024 | 10:23 PMUpdated May 24, 2024 | 1:19 AM
రాజస్థాన్​తో చావోరేవో మ్యాచ్​.. ఇప్పటికైనా SRH ఆ రాక్షసుడ్ని దింపుతుందా?

గ్రూప్ స్టేజ్​లో అదరగొట్టిన సన్​రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్​లోనూ దుమ్మురేపుతుందని అంతా అనుకున్నారు. టీమ్ నిండా పించ్ హిట్టర్లు ఉండటం, బౌలింగ్ దళం కూడా బలంగా ఉండటంతో జట్టుకు తిరుగుండదని భావించారు. ఫైనల్​కు చేరుకోవడం ఆరెంజ్ ఆర్మీకి నల్లేరు మీద నడకేనని అనుకున్నారు. కానీ అనుకున్నది ఒకటి.. అయినది ఒక్కటి. టోర్నీ ఆసాంతం అటాకింగ్ బ్యాటింగ్​తో విధ్వంసం సృష్టించిన ఎస్​ఆర్​హెచ్​.. క్వాలిఫయర్-1లో కోల్​కతా నైట్ రైడర్స్ మీద మాత్రం చేతులెత్తేసింది. బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిన సన్​రైజర్స్​ హైదరాబాద్​.. ఫైనల్​లో చోటు కోసం క్వాలిఫయర్-2 ఆడేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్ రాయల్స్​తో రేపు జరగనున్న పోరులో చావోరేవో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది.

సన్​రైజర్స్-రాజస్థాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రేపు క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్ చేరుకుంటుంది. ఈ పోరులో ఓడిన టీమ్ ఇంటిదారి పడుతుంది. అందుకే ఈ డూ ఆర్ డై ఫైట్​లో ఎలాగైనా గెలవాలని అనుకుంటోంది ఆరెంజ్ ఆర్మీ. గత మ్యాచ్​లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని అదరగొట్టాలని చూస్తోంది. ఎలాంటి మిస్టేక్స్​కు తావివ్వకుండా రాజస్థాన్ పని పట్టాలని అనుకుంటోంది. ఈ తరుణంలో ఎస్​ఆర్​హెచ్ అభిమానులను ఓ ప్రశ్న తొలచి వేస్తోంది. ఇన్నాళ్లూ ఆడకుండా దాచిన ఆ రాక్షసుడ్ని ఈ మ్యాచ్​లోనైనా బరిలోకి దింపుతారా? అని ఫ్యాన్స్ ఆలోచనల్లో మునిగిపోయారు. ఆ మాన్​స్టర్ మరెవరో కాదు.. స్పిన్ ఆల్​రౌండర్ గ్లెన్ ఫిలిప్స్.

పించ్ హిట్టింగ్, క్వాలిటీ స్పిన్ బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్​కు కేరాఫ్​ అడ్రస్ ఫిలిప్స్. అతడు గ్రౌండ్​లో ఉన్నాడంటేనే ప్రత్యర్థులు వణికిపోతారు. బ్యాటింగ్​కు దిగితే ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్​ చేయడం అతడికి అలవాటైన సంప్రదాయం. బాల్ చేతబడితే ఆఫ్​ స్పిన్​తో బ్యాటర్ల ఆటకట్టించడం వెన్నతో పెట్టిన విద్య. ఫీల్డింగ్​లోనూ పాదరసంలా కదులుతూ పరుగుల్ని కాపాడటమే గాక కఠినమైన క్యాచుల్ని కూడా అలవోకగా పట్టేస్తాడు. అలాంటోడ్ని మొన్న కేకేఆర్​ మీద ఆడించాల్సింది. కానీ కమిన్స్ ఆసక్తి చూపించలేదు. కానీ రేపు రాజస్థాన్​తో చావోరేవో పోరాటం. బ్యాటర్​గా విలువైన రన్స్ చేస్తూ, ఆఫ్ స్పిన్​తో వికెట్లు కూడా పడగొట్టే ఫిలిప్స్​ను ట్రంప్​కార్డ్​గా వాడుకోవచ్చు. ఈ రాక్షసుడు టీమ్​లో ఉంటే అవతలి జట్లు వణుకుతాయి. మరి.. ఫిలిప్స్ విషయంలో కమిన్స్ ఏం చేస్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by 𝚙𝚛𝚘𝚏𝚎𝚜𝚜𝚒𝚘𝚗𝚊𝚕 𝚢𝚎𝚍𝚊𝚟𝚊𝚕𝚞 (@professional_yedavalu)