iDreamPost

నిన్న మ్యాచ్​లో రాజస్థాన్ బ్యాటర్ మెడలోని ఈ డివైజ్​ను గమనించారా?​ ప్లేయర్లకు ఇదో వరం!

  • Published May 23, 2024 | 9:03 PMUpdated May 23, 2024 | 9:03 PM

క్రికెట్​లో టెక్నాలజీ ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీని వల్ల ప్రేక్షకులను మరింత క్వాలిటీ ఎంటర్​టైన్​మెంట్ అందుతోంది. అదే టైమ్​లో ఆటగాళ్లకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తగ్గుతున్నాయి.

క్రికెట్​లో టెక్నాలజీ ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీని వల్ల ప్రేక్షకులను మరింత క్వాలిటీ ఎంటర్​టైన్​మెంట్ అందుతోంది. అదే టైమ్​లో ఆటగాళ్లకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తగ్గుతున్నాయి.

  • Published May 23, 2024 | 9:03 PMUpdated May 23, 2024 | 9:03 PM
నిన్న మ్యాచ్​లో రాజస్థాన్ బ్యాటర్ మెడలోని ఈ డివైజ్​ను గమనించారా?​ ప్లేయర్లకు ఇదో వరం!

సాంకేతికత రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రంగంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఐటీ రంగం అనే కాదు.. ఇతర రంగాలు కూడా ఈ మార్పుల్ని వినియోగించుకుంటున్నాయి. టెక్నాలజీ వాడకం సైన్స్, హెల్త్​ వంటి ఇతర సెక్టార్స్​లో కూడా పెరిగింది. క్రికెట్​లో కూడా టెక్నాలజీని వాడి ఆడియెన్స్ వ్యూయింగ్ ఎక్స్​పీరియెన్స్​ను మెరుగుపరుస్తున్నారు. ప్రేక్షకులకు మరింత క్వాలిటీ ఎంటర్​టైన్​మెంట్​ను అందించేందుకు ఇది ఎంతో దోహదపడుతోంది. అదే టైమ్​లో సాంకేతికత వల్ల ఆటగాళ్లకు ఉండే పలు ఇబ్బందులు కూడా తొలగుతున్నాయి. ప్లేయర్ల ఫిట్​నెస్, పెర్​ఫార్మెన్స్​ను అంచనా వేయడానికి పలు టెక్ గ్యాట్జెట్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

క్రికెట్​లో సరికొత్త అన్వేషణలు జరుగుతూనే ఉంటాయి. ప్లేయర్ల కోసం టెక్ గ్యాట్జెట్స్ కొత్తవి వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ న్యూ డివైజ్ వచ్చేసింది. దీని గురించి చాలా మందికి తెలియదు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్​లో ఏక్యూ కాలర్ అనే డివైజ్ హైలైట్ అయింది. రాజస్థాన్ బ్యాటర్ కోలర్ క్యాడ్​మోర్ దీన్ని తన మెడలో వేసుకొని కనిపించాడు. ఇప్పటిదాకా ఇలాంటి డివైజ్​ను చూడని క్రికెట్ లవర్స్ దీని గురించి తెలుసుకునేదుకు ఆసక్తి చూసిస్తున్నారు. సీ-షేప్​లో ఉండే ఈ డివైజ్​ను అథ్లెట్ల కోసమే రూపొందించారు. 13 ఏళ్లకు మించిన అథ్లెట్లు ఎవరైనా దీన్ని ధరించొచ్చని తెలుస్తోంది. మ్యాచుల్లో ఆడే టైమ్​లో ప్రమాదవశాత్తూ తలకు గాయమైతే ఈ డివైజ్ సాయంతో మెదడుకు ఏమీ కాకుండా అడ్డుకోవచ్చట.

తల భాగానికి గాయమైన సమయంలో రక్తప్రసరణ వేగాన్ని పెంచి మెదడు కదలికలు పెరగకుండా ఏక్యూ డివైజ్ అడ్డుకుంటుందని తెలుస్తోంది. హెడ్ ఇంజ్యురీస్ అయినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఇది కాపాడుతుందట. ప్రస్తుతం డిఫరెంట్ స్పోర్ట్స్​లో దీన్ని వందలాది అథ్లెట్లు వాడుతున్నారని సమాచారం. క్రికెట్​లో బ్యాటర్లకు తలకు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. అలా గాయాలపాలై ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ ప్రాణాలు వదిలిన సందర్భం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో తలకు రక్షణగా నిన్న ఆర్సీబీతో మ్యాచ్​లో రాజస్థాన్ బ్యాటర్ క్యాడ్​మోర్ దీన్ని ధరించి కనిపించాడు. ఇక మీదట ఇతర క్రికెటర్స్ కూడా దీన్ని ధరించడం పక్కా అని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి