iDreamPost

IPL 2024: వీడియో: క్రికెట్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న షారుఖ్.. అందుకే కింగ్ ఖాన్ అనేది!

  • Published Apr 15, 2024 | 9:02 PMUpdated Apr 15, 2024 | 9:02 PM

కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్ అందరి మనసులు దోచుకున్నాడు. అతడు చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్ అందరి మనసులు దోచుకున్నాడు. అతడు చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

  • Published Apr 15, 2024 | 9:02 PMUpdated Apr 15, 2024 | 9:02 PM
IPL 2024: వీడియో: క్రికెట్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న షారుఖ్.. అందుకే కింగ్ ఖాన్ అనేది!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్​ లేకపోయినా హిందీ సినీ పరిశ్రమను ఏలే స్థాయికి ఆయన చేరుకున్నారు. భారత్​తో పాటు విదేశాల్లోనూ ఆయనకు హ్యూజ్ ఫ్యాన్​బేస్ ఉంది. మన దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మూవీ స్టార్స్​లో టాప్​-5లో ఉన్న కింగ్ ఖాన్.. సినిమాల ద్వారా వచ్చే సంపాదనను ఇతర వ్యాపారాలకు విస్తరింపజేశారు. ఈ క్రమంలోనే ఐపీఎల్​లో ఓ టీమ్​ను కొన్నారు. అదే కోల్​కతా నైట్ రైడర్స్​. సినిమాల్లో నటించడంతో పాటు కేకేఆర్ ఓనర్​గానూ తన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తూ అభిమాన గణాన్ని మరింత పెంచుకున్నారు షారుఖ్. అలాంటి ఆయన మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు.

కోల్​కతా ఆడే మ్యాచ్​లకు హాజరవుతుంటారు షారుఖ్. టీమ్​ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయనతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మ్యాచ్​లకు రావడం చూస్తూనే ఉంటాం. గ్యాలరీల్లో కూర్చొని టీమ్ ప్లేయర్లను ఉత్సాహపరిచే షారుఖ్.. తాజాగా ఓ పనితో అందరి హృదయాలను దోచుకున్నారు. కేకేఆర్, లక్నో టీమ్స్ మధ్య ఆదివారం కోల్​కతా వేదికగా మ్యాచ్ జరిగింది. ఇది ముగిసిన తర్వాత ప్రేక్షకులు, సెలబ్రిటీలు స్టేడియాన్ని వీడారు. కానీ షారుఖ్ మాత్రం మైదానంలోని సీట్ల కింద పడి ఉన్న కేకేఆర్ టీమ్ జెండాలను ఎత్తారు. ఫ్లాగ్స్ అన్నింటినీ తీసి ఒకచోట చేర్చారు. ఆ సమయంలో కొందరు ఆడియెన్స్ కింద గ్యాలరీలో కూర్చొని ఉన్నారు. దీన్ని చూసి ఫిదా అయి..  షారుఖ్, షారుఖ్ అంటూ అరిగారు. జెండాలను ఎత్తిన తర్వాత వాళ్లందరికీ అభివాదం చేశారాయన.

కేకేఆర్ ఫ్లాగ్స్​ను షారుఖ్ ఎత్తిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనమని.. షారుఖ్ నిజంగా కింగ్ ఖాన్ అని మెచ్చుకుంటున్నారు. ఏ టీమ్ ఓనర్ కూడా ఈ పని చేయరని.. ఇది కేకేఆర్ ఫ్రాంచైజీ మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం, బాధ్యతను తెలియజేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్​బేస్ అనేది ఇలాంటి చిన్న చిన్న చర్యల వల్లే ఏర్పడుతుందని.. మంచితనం, ప్రేమకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఇక, ఈ సీజన్​లో కేకేఆర్ అదరగొడుతోంది. ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో నాలుగింట నెగ్గి 8 పాయింట్లతో పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానంలో నిలిచింది కోల్​కతా. మరి.. టీమ్​ జెండాలను ఎత్తిన షారుఖ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి