Nidhan
క్రికెటర్లు తమ కెరీర్లో ఎన్నో చోట్ల మ్యాచ్‌లు ఆడతారు. అయితే అన్ని స్టేడియాల్లోనూ ఒకే లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉండదు. ఇదే విషయంపై మాట్లాడుతూ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ స్టేడియంలో మ్యాచ్ అంటే చాలు.. వణుకు పుడుతుందన్నాడు.
క్రికెటర్లు తమ కెరీర్లో ఎన్నో చోట్ల మ్యాచ్‌లు ఆడతారు. అయితే అన్ని స్టేడియాల్లోనూ ఒకే లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉండదు. ఇదే విషయంపై మాట్లాడుతూ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ స్టేడియంలో మ్యాచ్ అంటే చాలు.. వణుకు పుడుతుందన్నాడు.
Nidhan
క్రికెటర్లు తమ కెరీర్లో భాగంగా ఎన్నో దేశాలకు వెళ్తుంటారు. ఎన్నో చోట్ల మ్యాచ్‌లు ఆడతారు. అయితే అన్ని స్టేడియాల్లోనూ ఒకే లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉండదు. కొన్ని చోట్ల ప్రేక్షకులు ఆదరించి అక్కున చేర్చుకుంటారు. మరికొన్ని చోట్ల అంతగా ఆదరణ దక్కదు. హోమ్ టీమ్స్‌కే ఎక్కువగా సపోర్ట్ ఇస్తుంటారు. అయితే ఇంకొన్ని చోట్ల మాత్రం ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు, ట్రోల్స్ కూడా వస్తుంటాయి. దీన్ని ఎదుర్కోవడం ఎంతటి క్రికెటర్లకైనా కష్టమే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ వైడ్ హ్యూజ్ ఫ్యాన్‌బేస్ కలిగిన హిట్‌మ్యాన్‌కు ఓ స్టేడియంలో ఆడాలంటే వణుకు పుడుతుందట. ఏంటా స్టేడియం? ఎందుకంత భయం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారత కెప్టెన్ రోహిత్ శర్మను కోట్లాది మంది ఇష్టపడతారు. ఏ దేశంలో వెళ్లినా అతడి బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. ఫీల్డింగ్ సమయంలోనూ అతడ్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఓ స్టేడియంలో మ్యాచ్ అంటేనే అతడికి వణుకు పుడుతుందట. అది మరేదో కాదు.. ఆస్ట్రేలియాలోని చారిత్రక ఎంసీజీ (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్). అక్కడ మ్యాచ్ అంటే తనకు ఫ్యూజులు ఔట్ అవుతాయని అంటున్నాడు హిట్‌మ్యాన్. ‘క్రికెట్ స్టేడియాల్లో అత్యంత భయానకమైనదిగా ఎంఎసీజీని చెప్పొచ్చు. అక్కడ మేం బాక్సింగ్ డే టెస్ట్ ఆడాం. ఆ గ్రౌండ్లో కుడి వైపు ఉన్నారంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అదే వేరే సైడ్ ఉన్నారంటే మాత్రం మీకు చుక్కలు చూపిస్తారు. మీ లైఫ్‌ను నరకంగా మార్చేస్తారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆడటం చాలా కష్టమని రోహిత్ తెలిపాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన రిటైర్మెంట్ గురించి కూడా హిట్‌మ్యాన్ రియాక్ట్ అయ్యాడు. ఇప్పట్లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పనని.. మరికొన్నేళ్లు గేమ్‌లో కంటిన్యూ అవుతానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను మంచి టచ్‌లో ఉన్నానని.. ఇదే ఊపును కొనసాగించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2025లో టీమిండియాను విజేతగా నిలపడం తన ముందున్న బిగ్ టార్గెట్ అని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని.. వరల్డ్ కప్ నెగ్గాలనే డ్రీమ్ కోసం కష్టపడుతున్నానని వివరించాడు హిట్‌మ్యాన్. మరి.. ఎంసీజీలో ఆడాలంటే వణుకు పుడుతుందంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said, “MCG is the most intimidating Stadium to play. We played a Boxing Day Test match there, it was an amazing atmosphere like if you’re on the right side of it you can have fun, but if you’re not then they’re going to make your life tough”. (BWC/Gaurav Kapur). pic.twitter.com/zCHXVSTcGt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2024