iDreamPost

Jake Fraser McGurk: డెబ్యూ మ్యాచ్​లోనే సిక్సర్ల వర్షం! ఎవరీ జేక్ ఫ్రేజర్?

  • Published Apr 13, 2024 | 8:19 AMUpdated Apr 13, 2024 | 8:20 AM

ఐపీఎల్ డెబ్యూలో అదరగొట్టాడో యంగ్ బ్యాటర్. సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్​ను వన్​సైడ్ చేసేశాడు. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఐపీఎల్ డెబ్యూలో అదరగొట్టాడో యంగ్ బ్యాటర్. సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్​ను వన్​సైడ్ చేసేశాడు. దీంతో అతడి గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

  • Published Apr 13, 2024 | 8:19 AMUpdated Apr 13, 2024 | 8:20 AM
Jake Fraser McGurk: డెబ్యూ మ్యాచ్​లోనే సిక్సర్ల వర్షం! ఎవరీ జేక్ ఫ్రేజర్?

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఓ విజయాన్ని సాధించింది. హ్యాట్రిక్ విక్టరీస్​తో దూసుకెళ్తున్న లక్నో సూపర్ జియాంట్స్ జోరుకు డీసీ బ్రేకులు వేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య లక్నోలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఎల్​ఎస్​జీ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డీసీ మరో 11 బంతులు ఉండగానే టార్గెట్​ను రీచ్ అయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీని కిందకు నెట్టి 9వ స్థానానికి చేరుకుంది పంత్ సేన. అయితే ఈ మ్యాచ్​లో అందరి కంటే కూడా యంగ్​ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్ ఆడిన తీరు హైలైట్ అనే చెప్పాలి. ఐపీఎల్ డెబ్యూలోనే తన బ్యాట్ పవర్ ఏంటో అతడు చూపించాడు.

ఫ్లాట్ వికెట్ మీద లక్నో విసిరిన టార్గెట్ డీసీకి ఛేజ్ చేయడం ఈజీ అయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8) త్వరగా ఔట్ అయినా మరో ఓపెనర్ పృథ్వీ షా (22 బంతుల్లో 32) రాణించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేక్ ఫ్రేజర్ (35 బంతుల్లో 55) చెలరేగిపోయాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (24 బంతుల్లో 41) తోడుగా లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. ఫ్రేజర్ సిక్సర్ల వర్షంలో ఆడియెన్స్ తడిసి ముద్దయ్యారు. అతడు 2 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సర్లు బాదాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడు. విజయానికి చేరువలో ఉన్నప్పుడు వీళ్లిద్దరూ ఔటయ్యారు. ట్రిస్టన్ స్టబ్స్ (15 నాటౌట్), షై హోప్ (11 నాటౌట్) మిగిలిన పనిని పూర్తి చేశారు. అయితే డీసీ ఇన్నింగ్స్​లో మెరుపు బ్యాటింగ్​తో అలరించిన ఫ్రేజర్​ గురించి అందరూ తెలుసుకునే పనిలో పడ్డారు.

ఎవరీ జేక్ ఫ్రేజర్?

క్రీజులోకి దిగిందే ఆలస్యం భారీ షాట్లతో విరుచుకుపడుతూ చూస్తుండగానే మ్యాచ్​ను తారుమారు చేయడం జేక్​ ఫ్రేజర్​కు అలవాటు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ యంగ్ బ్యాటర్.. ఏప్రిల్ 11, 2022లో జన్మించాడు. బ్యాటింగ్​ చేయడంతో పాటు లెగ్​బ్రేక్ బౌలింగ్​తో వికెట్లు తీసే సత్తా కూడా అతడికి ఉంది. ఆసీస్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన ఫ్రేజర్.. 2 మ్యాచుల్లో 51 పరుగులు చేశాడు. లిస్ట్​-ఏ క్రికెట్​లో 21 మ్యాచుల్లో 525 రన్స్ చేశాడు. అందులో ఓ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. టీ20 స్పెషలిస్ట్​గా పేరు తెచ్చుకున్న ఫ్రేజర్.. ఇప్పటిదాకా 38 మ్యాచుల్లో 700 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఔట్ అవుతాననే భయం లేకుండా ఫియర్​లెస్ అప్రోచ్​తో బ్యాటింగ్ చేసే ఈ యంగ్ బ్యాటర్ ఎంత సేపు క్రీజులో ఉంటే అంతసేపు బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. అది నిన్నటి మ్యాచ్​తో మరోమారు ప్రూవ్ అయింది. కృనాల్ పాండ్యా వేసిన ఓ ఓవర్​లో వరుసగా 3 సిక్సర్లు కొట్టాడతను. మరి.. ఫ్రేజర్ ఇన్నింగ్స్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి