iDreamPost

ప్రాక్టీస్ మ్యాచ్​లో రోహిత్ విశ్వరూపం! పాండ్యా బౌలింగ్​లో బౌండరీల వర్షం!

  • Published Mar 21, 2024 | 2:25 PMUpdated Mar 21, 2024 | 2:25 PM

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. కసి మీద ఉన్న హిట్​మ్యాన్.. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై రివేంజ్ తీర్చుకున్నాడు.

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. కసి మీద ఉన్న హిట్​మ్యాన్.. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై రివేంజ్ తీర్చుకున్నాడు.

  • Published Mar 21, 2024 | 2:25 PMUpdated Mar 21, 2024 | 2:25 PM
ప్రాక్టీస్ మ్యాచ్​లో రోహిత్ విశ్వరూపం! పాండ్యా బౌలింగ్​లో బౌండరీల వర్షం!

ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రెడీ అవుతున్నాడు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా ఇషాన్ కిషన్, జస్​ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లు అందరూ ఎప్పుడో ముంబై క్యాంప్​లో జాయిన్ అయ్యారు. హార్దిక్ కొబ్బరి కాయ కొట్టి కొత్త సీజన్​ను స్టార్ట్ చేశాడు. అయితే టీమ్ మొత్తం కలసికట్టుగా సాధన చేస్తున్నా హిట్​మ్యాన్ మాత్రం రాలేదు. సీజన్​కు టైమ్ దగ్గర పడుతున్న వేళ ఈసారి తాను బరిలోకి దిగడం లేదంటూ హఠాత్తుగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేశాడు రోహిత్. దీంతో అతడు ఆడకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ముంబై క్యాంప్​లో జాయిన్ అయ్యాడు హిట్​మ్యాన్. సింహంలా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే హార్దిక్ మీద రివేంజ్ కూడా​ తీర్చుకున్నాడు. పాండ్యా బౌలింగ్​లో చెడుగుడు ఆడుకున్నాడు.

ఈసారి రోహిత్ కసి మీద ఉన్నాడు. నెట్స్​లో తీవ్రంగా సాధన చేస్తున్నాడతను. సూపర్బ్ టచ్​లో కనిపిస్తున్నాడు హిట్​మ్యాన్. సరిగ్గా సీజన్ స్టార్ట్​ అవడానికి ముందు ప్రాక్టీస్​లో భాగంగా ముంబై టీమ్ ప్లేయర్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. రెండు జట్లుగా విడిపోయి ఈ మ్యాచ్​ ఆడారు. ఇందులో భాగంగా బ్యాటింగ్​కు దిగిన రోహిత్​కు పాండ్యా బౌలింగ్ చేశాడు. అయితే ఇన్నాళ్లుగా తనలో దాగి ఉన్న కసి, కోపాన్ని మొత్తం ఇక్కడ చూపించాడు హిట్​మ్యాన్. హార్దిక్​ బౌలింగ్​లో ఎడాపెడా షాట్లు బాదేశాడు. పాండ్యా బాల్ వేయడమే ఆలస్యం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఏకంగా అతడి ఓవర్​లో 17 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 బౌండరీలతో పాటు ఓ భారీ సిక్స్ కూడా ఉంది. హిట్​మ్యాన్ ఉప్పెనలా విరుచుకుపడుతుంటే ఏం చేయాలో హార్దిక్​కు పాలుపోలేదు. కెప్టెన్సీ మార్పు విషయంలో కోపంగా ఉన్న రోహిత్ అయితే తన రివేంజ్ తీర్చుకొని నవ్వుతూ కనిపించాడు. దీని గురించి తెలిసిన నెటిజన్స్ అస్సలు తగ్గొదని అంటున్నారు.

ఇక, ఈ మ్యాచ్​కు ముందు ఓ సందర్భంలో గ్రౌండ్​లో హార్దిక్ కలుగజేసుకొని రోహిత్​ను పలకరించాడు. అతడ్ని హగ్ చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో హిట్​మ్యాన్ ఏదో నవ్వాలి కాబట్టి నవ్వాలి అన్నట్లు ఓ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్​లో బ్యాటింగ్​ స్టార్ట్ చేసి బాల్​ను వీరబాదుడు బాదాడు. హార్దిక్ బౌలింగ్​లో వచ్చిన బాల్​ను వచ్చినట్లు భారీ షాట్లుగా మలిచాడు. అతడి జోరు చూస్తుంటే పాండ్యా మీద కోపం ఇంకా చల్లారనట్లే కనిపిస్తోంది.  నెట్స్​లో సూపర్బ్ టచ్​లో కనిపించిన రోహిత్ దాన్నే మ్యాచుల్లోనూ కంటిన్యూ చేస్తే ప్రత్యర్థి బౌలర్లకు ఇక కష్టమే. హిట్​మ్యాన్ బ్యాటింగ్ వీడియోలు చూసిన నెటిజన్స్.. మొత్తానికి హార్దిక్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు. పాండ్యా మీద ఉన్న కోపాన్ని బాల్​పై చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు. కసిగా బ్యాటింగ్ చేయడం చూస్తుంటే ఈసారి హిట్​మ్యాన్ ఊరుకునేలా కనిపించడం లేదని అంటున్నారు. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి