Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోమారు విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. మెరుపు శతకంతో చెలరేగిపోయాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోమారు విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. మెరుపు శతకంతో చెలరేగిపోయాడు.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ ఉతికి ఆరేశాడు. 39 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు హెడ్. మాస్ హిట్టింగ్తో ఆర్సీబీకి మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేశాడు. 9 బౌండరీలు కొట్టిన హెడ్.. ఏకంగా 8 భారీ సిక్సులు బాదాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే 84 పరుగులు పిండుకున్నాడతను. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
హెడ్‌కు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34) కూడా మంచి సపోర్ట్ అందించాడు. వీళ్లిద్దరూ కలసి ఎడాపెడా షాట్లు బాదుతుండటంతో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 7 మంది బౌలర్లను మార్చాడు డుప్లెసిస్. అయినా సన్‌రైజర్స్ స్కోరుకు బ్రేకులు పడలేదు. ముఖ్యంగా హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో బెంగళూరు బౌలర్లు గుడ్లు తేలేశారు. సెంచరీ తర్వాత మరో రెండు పరుగులు చేసి ఔటయ్యాడు హెడ్. ఎస్ఆర్హెచ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. మరి.. హెడ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
TRAVIS HEAD SCORES THE FASTEST CENTURY FOR SRH IN IPL HISTORY…!!!! 🤯💥 pic.twitter.com/14Xk2aLaUB
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024
Travis Head is a solid striker. 🤯👊pic.twitter.com/tZSUTXZXBv
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024