iDreamPost

MS Dhoni: ముంబైతో మ్యాచ్​ తర్వాత BCCI హెడ్​క్వార్టర్స్​కు ధోని.. పెద్ద ప్లానింగే ఇది!

  • Published Apr 15, 2024 | 7:58 PMUpdated Apr 15, 2024 | 7:58 PM

ముంబై ఇండియన్స్​తో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​ తర్వాత బీసీసీఐ హెడ్​క్వార్టర్స్​కు వెళ్లాడు ధోని. దీని వెనుక పెద్ద ప్లానింగే ఉంది.

ముంబై ఇండియన్స్​తో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​ తర్వాత బీసీసీఐ హెడ్​క్వార్టర్స్​కు వెళ్లాడు ధోని. దీని వెనుక పెద్ద ప్లానింగే ఉంది.

  • Published Apr 15, 2024 | 7:58 PMUpdated Apr 15, 2024 | 7:58 PM
MS Dhoni: ముంబైతో మ్యాచ్​ తర్వాత BCCI హెడ్​క్వార్టర్స్​కు ధోని.. పెద్ద ప్లానింగే ఇది!

చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఐపీఎల్-2024 సీజన్​ను ఆ టీమ్ సూపర్బ్​గా స్టార్ట్ చేసింది. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్​లో కనిపించింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్​తో పాటు సన్​రైజర్స్ హైదరాబాద్ చేతిలో వరుస పరాజయాలు పలకరించారు. దీని నుంచి కోలుకున్న రుతురాజ్ సేన బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్​లో 3వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్​లో సీఎస్​కే గెలుపులో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్​లో 4 బంతుల్లో 20 పరుగులతో టీమ్​కు భారీ లీడ్ అందించాడు. ఆ తర్వాత ముంబై ఇన్నింగ్స్ సమయంలో  రుతురాజ్​కు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి మ్యాచ్​ను చెన్నై వైపు తిప్పాడు. అలాంటి ధోని మ్యాచ్ పూర్తయిన తర్వాత బీసీసీఐ హెడ్​క్వార్టర్స్​కు వెళ్లడం హాట్ టాపిక్​గా మారింది.

ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ హెడ్​క్వార్టర్స్​కు వెళ్లాడు ధోని. అక్కడ చాలా సేపు ఉన్న మాహీ 2011 వరల్డ్ కప్ ట్రోఫీని మరోసారి తిలకించాడు. ప్రపంచ కప్ జ్ఞాపకాలను మరోమారు నెమరేసుకున్నాడు. అక్కడి తన ఫొటోలపై సంతకాలు చేశాడు. సీఎస్​కే ప్రాక్టీస్ జెర్సీలోనే మాహీ బోర్డు ఆఫీస్​కు వెళ్లిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే పైకి ఇది నార్మల్ విజిట్​లాగే కనిపించినా దీని వెనుక వేరే మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్-2024 స్టార్ట్ కానుంది. మెగాటోర్నీకి వెళ్లబోయే భారత జట్టుకు సంబంధించి ఇప్పటికే సెలక్టర్లు వర్క్ చేస్తున్నారు. జట్టులో ఎవరెవరు ఉండాలనే దానిపై కొంత అవగాహనకు వచ్చారని వినికిడి. ఐపీఎల్​లో ప్లేయర్లు ఆడుతున్న తీరును దగ్గరుండి మరీ సెలక్టర్లు గమనిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ధోనీని కూడా ఈ ప్రాసెస్​లో భాగం చేయాలని బోర్డు భావిస్తోందట.

టీ20 ప్రపంచ కప్-2021కు వెళ్లిన భారత జట్టులో ధోని కూడా ఉన్నాడు. అయితే టీమ్​లో ప్లేయర్​గా కాదు.. మెంటార్​గా ఉన్నాడు. ఆ ఏడాది టీమిండియా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ మెంటార్​గా ఆటగాళ్లకు సరైన గైడెన్స్ ఇచ్చి మంచి మార్కులు కొట్టేశాడు మాహీ. ఇంకా ఐపీఎల్​లో కొనసాగుతున్న ధోని.. ఈసారి కెప్టెన్సీకి దూరంగా ఉన్నా తన వ్యూహాలతో టీమ్​ విజయాల్లో పరోక్షంగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనికి ఫిదా అయిన బీసీసీఐ సెక్రటరీ జైషా మాస్టర్ స్కెచ్ వేశాడట. హెడ్​క్వార్టర్స్​కు వచ్చిన ధోనీకి కొత్త బాధ్యతలు అప్పజెప్పాడని వినికిడి. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​కు వెళ్లే భారత జట్టుకు అతడ్ని మెంటార్​గా ఉండమని కోరాడట. అయితే ఈసారి ప్లేయర్లను మోటివేట్ చేయడమే గాక రాహుల్ ద్రవిడ్​తో కూడిన కోచింగ్ బృందంతో కలసి వ్యూహాలు పన్నే వర్క్​ను కూడా మాహీకి అప్పగించారని సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. ఒకవేళ టీమిండియాకు ధోని మెంటార్​గా వస్తే మాత్రం బిగ్ ప్లస్ అనే చెప్పాలి. అతడి అనుభవం జట్టుకు కచ్చితంగా ఉపయోగడపతుంది. మరి.. ధోని మెంటార్​గా ఉండి టీమ్​ను నడిపించాలని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి