iDreamPost
android-app
ios-app

IPL 2024: దరిద్రంలో RCBని దాటేసిన పంజాబ్! అన్ని మ్యాచ్ ల్లో ఒక్కటే బ్యాడ్ లక్! గమనించారా?

  • Published Apr 19, 2024 | 1:17 PM Updated Updated Apr 19, 2024 | 1:43 PM

దరిద్రంలో RCBని దాటేస్తోంది పంజాబ్ కింగ్స్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? అన్ని మ్యాచ్ ల్లో ఒక్కటే బ్యాడ్ లక్ పంజాబ్ ను వెంటాడుతోంది. ఇంతకీ ఆ బ్యాడ్ లక్ ఏంటంటే?

దరిద్రంలో RCBని దాటేస్తోంది పంజాబ్ కింగ్స్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? అన్ని మ్యాచ్ ల్లో ఒక్కటే బ్యాడ్ లక్ పంజాబ్ ను వెంటాడుతోంది. ఇంతకీ ఆ బ్యాడ్ లక్ ఏంటంటే?

IPL 2024: దరిద్రంలో RCBని దాటేసిన పంజాబ్! అన్ని మ్యాచ్ ల్లో ఒక్కటే బ్యాడ్ లక్! గమనించారా?

IPL.. 17 ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న క్యాష్ రిచ్ లీగ్. తొలి సీజన్ లో అభిమానులను ఎలా అలరించిందో.. అంత కంటే ఎక్కువగా సీజన్, సీజన్ కు కిక్కిస్తూ వస్తోంది. అయితే ఎన్ని సీజన్లు మారినా గానీ.. ఒక్క టీమ్ దరిద్రం మాత్రం మారడం లేదు. మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది.. నేను ఏ జట్టు గురించి మాట్లాడుతున్నానో. ఎన్ని సీజన్లు మారినా గానీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ దశ మాత్రం మారడం లేదు. అయితే దరిద్రంలో RCBని దాటేస్తోంది ఓ టీమ్. అదే పంజాబ్ కింగ్స్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? అన్ని మ్యాచ్ ల్లో ఒక్కటే బ్యాడ్ లక్ పంజాబ్ ను వెంటాడుతోంది. ఇంతకీ ఆ బ్యాడ్ లక్ ఏంటంటే?

పంజాబ్ కింగ్స్.. దరిద్రంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దాటేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత దరిద్రమైన టీమ్ ఏదంటే? అందరి నోట ఒక్కటే మాట ఆర్సీబీ అని వస్తుంది. అంతలా ఆ టీమ్ దరిద్రాని బ్రాండ్ అంబాసిడర్ లాగా తయ్యారైంది. ఇక ఇప్పుడు ఆ బ్యాడ్ లక్ పంజాబ్ కు అట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సీజన్ లో పంజాబ్ బాగానే ఆడుతున్నా.. అన్ని మ్యాచ్ ల్లో ఒకే ఒక్క బ్యాడ్ లక్ ఆ టీమ్ ను వెంటాడుతోంది. అదేంటంటే? లాస్ట్ ఓవర్. అవును ఈ సీజన్ లో పంజాబ్ ఆడిన మ్యాచ్ లన్నింటినీ ఓసారి పరిశీలిస్తే.. మీకే అర్ధమవుతుంది. పంజాబ్ కింగ్స్ కు లాస్ట్ ఓవర్ ఫీవర్ పట్టుకుందని. ఆ వివరాల్లోకి వెళితే..

Punjab is breaking RCB's record in poverty

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే అద్భుత విజయం సాధించింది. మెుదటి పోరులో ఢిల్లీ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లకు ఛేదించింది. ఇదొక్కటే మ్యాచ్ కాదు.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లన్నీ చివరి ఓవర్లోఆడి గెలిచి, ఓడినవే. నెక్ట్స్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 176 పరుగులను 6 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో కొట్టింది ఆర్సీబీ. ఇక లక్నో విధించిన 200 రన్స్ టార్గెట్ ను 20 ఓవర్లు ఆడి కూడా కొట్టలేకపోయింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ను కూడా చివరి ఓవర్లోనే విన్నింగ్ సాధించింది.

ఇక ఆ తర్వాత SRH, RR తాజాగా ముంబై చేతిలో కూడా చివరి ఓవర్లో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లను గమనిస్తే.. పంజాబ్ కు చివరి ఓవర్ గండం ఉందని స్పష్టంగా అర్దమవుతోంది. ఆఖరి ఓవర్ పంజాబ్ కు బ్యాడ్ లక్ గా మారింది. అయితే క్రీడానిపుణులు మాత్రం ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ టఫ్ ఫైట్ ఇస్తోంది అంటూ ప్రశంసిస్తున్నారు. మరి దరిద్రంలో ఆర్సీబీని దాటేస్తున్న పంజాబ్ బ్యాడ్ లక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.