Nidhan
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా ఈసారి ఐపీఎల్‌లో అదరగొడతాడని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అతడు ఇక లీగ్‌లో కనిపించడం కష్టంగానే ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా ఈసారి ఐపీఎల్‌లో అదరగొడతాడని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అతడు ఇక లీగ్‌లో కనిపించడం కష్టంగానే ఉంది.
Nidhan
ఈసారి ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సూపర్ స్టార్లతో పాటు పలువురు యంగ్ క్రికెటర్ల ఆటను చూసేందుకు కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందులోనూ టీమిండియాకు ఎంపికై పలు మ్యాచులు ఆడి.. మళ్లీ కనిపించకుండా పోయిన పృథ్వీ షా వంటి బ్యాటర్ల గేమ్‌ను చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. ఎంతో టాలెంటెడ్ ప్లేయర్ అయిన షా ఈసారి ఢిల్లీ తరఫున అదరగొట్టి తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అతడు ఐపీఎల్‌లో ఇక కనిపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు షాకు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్‌లో పృథ్వీ షా కనిపించడం కష్టంగానే ఉంది. నయా సీజన్‌లోని ఆరంభ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది . అయితే మ్యాచ్‌కు ముందు డీసీ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్‌లో షా పేరు లేదు. డొమెస్టిక్ క్రికెట్లో ఫర్వాలేదనిపిస్తున్న అతడు.. ఐపీఎల్‌తో టచ్‌లోకి వద్దామని అనుకున్నాడు. కానీ ఢిల్లీ ఫ్రాంచైజీ మాత్రం మొదటి మ్యాచ్‌లో మొండిచెయ్యి చూపించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌తో పాటు వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను ఓపెనర్లుగా సెలక్ట్ చేసింది. టీమ్ నమ్మకాన్ని నిలబెడుతూ వార్నర్-మార్ష్ జోడీ సూపర్బ్ స్టార్ట్ అందించింది. 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించింది.
అటు షా ఫామ్‌లో లేడు, ఇటు వార్నర్-మార్ష్ జోడీ సూపర్ టచ్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో షా పూర్తిగా బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరే స్లాట్‌లో ఆడిద్దామన్నా ఎక్కడా ఛాన్స్ కనిపించడం లేదు. వార్నర్, మార్ష్‌లు ఫెయిలైతే తప్ప షాకు ఛాన్స్ దొరికడం కష్టంగానే ఉంది. దీంతో అతడి ఐపీఎల్ కెరీర్ కూడా క్లోజ్ అని.. ఇక వెళ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. దేశవాళీల్లో రాణిస్తే తప్ప షా మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వలేడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. షాకు ఛాన్స్ రాకపోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: CSK ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. IPL 2024 నుంచి ధోని ఔట్? వైరలవుతున్న దిగ్గజ ప్లేయర్ మాటలు
DC playing XI:
Warner, Marsh, Hope, Pant (C) (WK), Bhui, Stubbs, Axar, Sumit Kumar, Kuldeep, Khaleel and Ishant. pic.twitter.com/cW7aGnd4x3
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024