iDreamPost

వీడియో: మొన్న ధోని చేసిన తప్పే ఇప్పుడు అయ్యర్ చేశాడు.. పాపం రస్సెల్ బలి!

  • Published May 03, 2024 | 10:00 PMUpdated May 03, 2024 | 10:00 PM

మొన్న మహేంద్ర సింగ్ ధోని చేసిన తప్పే ఇవాళ అయ్యర్ రిపీట్ చేశాడు. ఆ మిస్టేక్​ వల్ల పాపం ఆండ్రూ రస్సెల్ బలయ్యాడు.

మొన్న మహేంద్ర సింగ్ ధోని చేసిన తప్పే ఇవాళ అయ్యర్ రిపీట్ చేశాడు. ఆ మిస్టేక్​ వల్ల పాపం ఆండ్రూ రస్సెల్ బలయ్యాడు.

  • Published May 03, 2024 | 10:00 PMUpdated May 03, 2024 | 10:00 PM
వీడియో: మొన్న ధోని చేసిన తప్పే ఇప్పుడు అయ్యర్ చేశాడు.. పాపం రస్సెల్ బలి!

పంజాబ్ కింగ్స్​తో మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన ఓ పని వివాదాస్పదంగా మారింది. సీఎస్​కే ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్​లో మాహీ స్రైకింగ్​లో ఉన్నాడు. అవతలి ఎండ్​లో డారిల్ మిచెల్ ఉన్నాడు. అయితే ఓ బాల్​కు ఈజీ రన్ వచ్చే ఛాన్స్ ఉన్నా ధోని వద్దన్నాడు. అప్పటికే స్ట్రయికింగ్ ఎండ్​ వైపు వచ్చిన మిచెల్ మళ్లీ బౌలర్ ఎండ్ వైపు పరిగెత్తాడు. లక్కీగా అతడు ఔట్ కాలేదు. అయితే రెండు పరుగులు వచ్చే అవకాశం ఉన్నా ధోని రన్ వద్దనడంతో అందరూ అతడ్ని సెల్ఫిష్​ అంటూ ట్రోల్స్ చేశారు. పేరు కోసం ఆడుతున్నాడంటూ విమర్శించారు. అయితే ఇదే మిస్టేక్ ముంబైతో మ్యాచ్​లో కేకేఆర్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ రిపీట్ చేశాడు.

వాంఖడే వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్​లో వెంకీ అయ్యర్ (70) చేసిన తప్పునకు ఆండ్రీ రస్సెల్ బలయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఆ ఓవర్ ఆఖరి బంతిని అతడు ఫుల్లర్ లెంగ్త్​లో వేయగా.. దాన్ని రివర్స్ స్వీప్​గా మలిచాడు అయ్యర్. రన్ తీసేందుకు క్రీజు దాటి మూడు అడుగులు ముందుకు వచ్చాడు. దీంతో నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న రస్సెల్ (7) కూడా పరుగు అందుకున్నాడు. అక్కడ ఈజీగా సింగిల్ వచ్చేది. కానీ ఔట్ అవుతాననే భయంతో అయ్యర్ మళ్లీ క్రీజులోకి వచ్చేశాడు.

అప్పటికే బ్యాటింగ్ ఎండ్​కు చేరుకున్న రస్సెల్ మళ్లీ నాన్​స్ట్రయికింగ్ ఎండ్ వైపు పరుగు తీశాడు. ఈలోపు బంతిని అందుకున్న ఫీల్డర్ నువాన్ తుషార వెంటనే బౌలర్ వైపు త్రో విసిరాడు. బాల్ పిక్ చేసుకున్న పాండ్యా వికెట్లను గిరాటేశాడు. ఈజీ రన్ వచ్చే చోట అయ్యర్ చేసిన మిస్టేక్ కారణంగా రస్సెల్ బలయ్యాడు. దీంతో అయ్యర్ తీరును సోషల్ మీడియాలో నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఫీల్డర్ ఉన్నాడని ముందే చూసుకోవాలి కదా, రన్ కోసం కాల్ చేసి మళ్లీ వెనక్కి వెళ్లడం ఏంటని అంటున్నారు. సెల్ఫిష్ గేమ్​ ఆడొద్దంటూ చురకలు అంటిస్తున్నారు. మరి.. వెంకీ అయ్యర్ మిస్టేక్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి