iDreamPost
android-app
ios-app

వీడియో: బుమ్రాకే చుక్కలు చూపించిన మనీష్ పాండే.. ఆలా ఎలా కొట్టేశాడు!

  • Published May 03, 2024 | 9:29 PM Updated Updated May 03, 2024 | 9:29 PM

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​లో సింగిల్స్, డబుల్స్ తీసేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడతారు. టాప్ బ్యాటర్లను కూడా పరుగులు చేయకుండా కట్టడి చేస్తాడు బుమ్రా. అలాంటోడి బౌలింగ్​లో సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే రెచ్చిపోయాడు.

  • Published May 03, 2024 | 9:29 PMUpdated May 03, 2024 | 9:29 PM
వీడియో: బుమ్రాకే చుక్కలు చూపించిన మనీష్ పాండే.. ఆలా ఎలా కొట్టేశాడు!

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా బౌలింగ్​లో సింగిల్స్, డబుల్స్ తీసేందుకు బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడతారు. టాప్ బ్యాటర్లను కూడా పరుగులు చేయకుండా కట్టడి చేస్తాడు బుమ్రా. రన్స్ సంగతి పక్కనబెడితే అతడి బౌలింగ్​లో ఔట్ కాకుంటే చాలని చాలా మంది ఆటగాళ్లు కోరుకుంటారు. అలాంటోడి బౌలింగ్​లో కోల్​కతా నైట్ రైడర్స్ సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్​తో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో బుమ్రాకు పాండే చుక్కలు చూపించాడు. అతడి బౌలింగ్​లో కళ్లుచెదిరే సిక్స్ బాదాడు.

కేకేఆర్ ఇన్నింగ్స్​లో 14వ ఓవర్ వేసేందుకు బౌలింగ్​కు దిగాడు బుమ్రా. అప్పటికే క్రీజులో కుదురుకున్న మనీష్ పాండే ఆ ఓవర్​లో 12 పరుగులు పిండుకున్నాడు. ఒక ఫోర్​తో పాటు సిక్స్ కూడా బాదాడు. ఆ ఓవర్ మూడో బాల్​ను బంపర్​గా వేశాడు బుమ్రా. అయితే 141 కిలోమీటర్ల వేగంతో ఆఫ్ స్టంప్​కు ఆవల పడిన బంతిని థర్డ్ మ్యాన్ వైపు కొట్టాడు పాండే. ఒంటికాలు మీద బ్యాలెన్స్​ను కంట్రోల్ చేస్తూ భలేగా ఆడాడు ర్యాంప్ షాట్. ఈ షాట్ చూసి బుమ్రా షాకయ్యాడు. ఈ క్లాసికల్ షాట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. బుమ్రా బౌలింగ్​లో అలా ఎలా కొట్టావ్ సామి అని ఆశ్చర్యపోతున్నారు. మరి.. మనీష్ పాండే కొట్టిన సిక్స్​ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.